ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

జిల్లా పేరు మార్చాలి:-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, భూపాలపల్లి జిల్లా

Sammakka-Sarakka-Jatara-File
Sammakka-Sarakka-Jatara-File

తెలంగాణ రాష్ట్రంలో చివరిజిల్లాగా ఏర్పాటు అయిన ములుగు జిల్లాకి సమ్మక్క-సారలమ్మ జిల్లాగా పేరు మార్చాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాలోని తడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో సమ్మక్క-సారలమ్మ గిరి జన జాతర అంగరంగసంబురంగా జరుగుతుంది. సుమారు కోటిమందికిపైగా భక్తులువచ్చి అమ్మవార్లను దర్శించుకుంటా రు.ఈ యేడుకూడా ఫిబ్రవరి నెలలో చిన్న జాతర జరుగు తుంది.ఇప్పటికే ప్రతిరోజు వివిధ జిల్లాల నుండి, పక్క రాష్ట్రం అయిన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటూ ఉన్నారు. జాతర సందడి మొదలైంది.సెలవ్ఞ దినాలలో ఆంధ్ర నుండే కాక హైదరాబాద్‌ నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. సిరిసిల్లరాజన్న జిల్లాగామార్చిన ప్రభుత్వం ములుగు జిల్లాపేరు మార్చి సమ్మక్క-సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలి.

ప్రాంతీయ భాషలో సి.టెట్‌ నిర్వహించాలి: -రావుల రామ్మోహన్‌ రెడ్డి, వెల్దండ

జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి టెట్‌లో మార్పుల కోసం రాష్ట్రాలకు లేఖలు రాసి తమ అభిప్రాయాలు ఈ నెల 15 లోపుఅందచేయాలని మార్చి31లోపు సమావేశంజరిపి నూతన విద్యావిధానంప్రకారం ఉపాధ్యాయ అర్హతపరీక్షల్లో పలుమార్పు లు చేయనున్నామని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో ప్రాథమిక విద్య ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. కావ్ఞన జాతీయ స్థాయిలో నిర్వహించే సి.టెట్‌ కూడా ప్రాంతీయ భాషల్లో తప్పనిసరిగా నిర్వహిం చాలి. ప్రతి సంవత్సరం ఆంగ్ల, హిందీలో నిర్వహణ వలన 20 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే కేవలం రెండు లక్షల మంది ఉత్తీర్ణత పొందుతున్నారు. కావ్ఞన ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలి. అర్హత మార్కులు తగ్గించాలి.

వలంటీర్ల వేతనం పెంచాలి: -ఎల్‌.ప్రఫుల్లచంద్ర, ధర్మవరం, అనంతపురం జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు అనేకమంది ఉన్నారు. వారికి కనీస వేతనం రూ.12.వేలు ఇవ్వాలి.చాలీచాలని జీతాలతో కాలం వెళ్లబుచ్చలేని పరిస్థితి కనీసవేతనం కోసం వారు చేస్తున్న కృషి కొనియాడదగినది. ప్రస్తుతం ఇస్తున్న వేతనం వారికి చాలడం లేదు. కనుక వీరికి కనీస వేతన చట్టం అమలు చేయాలి. వారి బాధలుఅర్థంచేసుకోవాలి. సానుభూతితో సమస్యలు పరిష్కరిం చాలి. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి.పనికి తగ్గ వేతన విధానం అమలు చేయాలి.

చేతివృత్తుల వారిని ఆదుకోవాలి:-తోట యోగేందర్‌, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా

కంచరి, వడ్రంగి, కంసాలి, శిల్పి, కమ్మరులు అనాదిగా చేతి వృత్తి పనులపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కాలక్రమంలో చేతి వృత్తులు తమ శోభను కోల్పో తున్నాయి.అన్ని వృత్తులలో యాంత్రీకరణ జరుగుతుండటంతో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వీరి జీవితాలు నష్ట పోతున్నాయి.పాతకాలంలో వడ్రంగిపని లాభదాయకంగా ఉండే ది.కాని ప్రస్తుతం మార్కెట్‌లో డబుల్‌కాట్‌ మంచాలు, డ్రెస్సింగ్‌ టేబుల్స్‌,టీపాయలు,డైనింగ్‌టేబుల్‌, ఇతర గృహోపకరణాలు అనేక డిజైన్లలో యంత్రాలతో రూపొందించి షోరూమ్‌లలో విక్ర యిస్తుండటంతో వడ్రంగిపనివారు నష్టపోతున్నారు.కొత్త యం త్రాలు సమకూర్చుకొని తమ వృత్తిలో నూతనత్వం పొందడా నికిసరైన పెట్టుబడిలేక రోజువారీకూలీలుగా మిగిలిపోతున్నారు. చేతివృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వీరికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి విరివిగా వడ్డీలేని రుణాలు అందిం చాలి. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ఇ-ఆఫీస్‌తో ఎంతో సౌలభ్యం: -ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సిఎంవో నుండి గ్రామ పంచాయతీ దాకా ఇ- ఆఫీస్‌ విధానం ప్రవేశపెట్టడం హర్షదాయకం.ఇందువలన గంపెడు ఫైళ్లు భుజా నికి ఎత్తుకొని టేబుళ్ల చుట్టూ ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి చుట్టు తిరిగే పని లేకుండా పోయింది. ఆగస్టు నుండి అన్ని33జిల్లాల్లోని ఆఫీసులు, ఇ-ఆఫీసులుగా మారడం వలన పనివేగవంతం కావడం, పారదర్శకత, అవినీతిరహిత పాలన, డేటా అందరికీ అందుబాటులో ఉండటం, చిన్న చిన్న సాకులతోఫైళ్లను తొక్కిపెట్టి ఉంచడంవంటి సమస్యలు సత్వరం తొలగిపోయాయి.ఆన్‌లైన్‌ విధానంలోఎవరైనా,ఎక్కడి నుండైనా సిస్టమ్‌లోనికి లాగిన్‌ అయ్యి తమ ఫిర్యాదు లేక దరఖాస్తు ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు, అధికారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.

ఆధార్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి:-దేవులపల్లి రమేశ్‌, నంగునూరు, సిద్ధిపేట

తెలంగాణ రాష్ట్రంలో ఓటిపి ద్వారా రేషన్‌ తీసుకోవడం, ఆధార్‌ అనుసంధానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రేషన్‌ షాప్‌లో ఆధార్‌సెంటర్‌ను ప్రభుత్వంవెంటనే ఏర్పాటు చేయాలి. ఆధార్‌ సెంటర్‌ మండలానికి ఒకటి ఉండటం వల్ల వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బందిపడుతున్నారు. కావున ప్రతి రేషన్‌ షాప్‌లో ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.