ప్రజావాక్కు: సమస్యలపై ప్రజాగళం

జిఎస్టీ నుండి ఉపశమనం కల్పించాలి: యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో ఆటో, లారీ, వ్యాన్లతో రవాణా మూలంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరగనున్నాయి. ద్విచక్రవాహనాలపై వ్యాపారం చేసేవారికి నడ్డి విరిగినట్టయింది. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గుతుంటే రాష్ట్రంలో పెరగడానికి పాలకుల వైఫల్యం కానవస్తుంది. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పూట గడవడమే గగనమౌతుంటే పెట్రో ధరల పెంపు మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టుంది. పెట్రోల్ ధరలపై పెంచిన పన్నులను వెంటనే రద్దుచేసి వాహనచోదకులను ఆదు కోవాలి. అలాగే పెట్రో ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి పెట్రో మంటల నుండి ప్రజలకు ఉపశమనం కల్పించాలి.
సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి -బి.సురేష్, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లు అనేక సమస్యలతో ఉన్నారు. సమగ్ర శిక్షాఅభియాన్ పథకం అమలు వలన ఈ మోడల్ స్కూళ్ల మేనేజ్మెంట్పై కూడావిధాననిర్ణయం ప్రకటించాలి.ఈ ఆదర్శపాఠశాలల శాశ్వ త సిబ్బందికి అన్ని హక్కులు పొందే అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖ నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోవడం లేదు. కారుణ్య నియామకాలు, పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ అమలుతోపాటు ఉద్యోగులకు వర్తించే ఏసౌకర్యంపై విద్యాశాఖ, మోడల్ స్కూళ్ల విభాగం అధికారులు తగు ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందు వాస్తవ విషయాలను సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లడం లేదు. ఈ చర్యల వలన ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదర్శపాఠశాలల రెగ్యులర్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి.
నీటి కొరతను అధిగమించాలి -షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
అప్పుడే ఎండలు బాగా మండిపోతున్నాయి. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. వేసవి వచ్చిందంటే ప్రజలు నీటి కోసం నానా అవ స్థలకు గురికావాల్సి వస్తుంది. మున్సిపాలిటీలలో, గ్రామాలలో నివసించే ప్రజలకు నీటి కొరత ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.ప్రత్యామ్నాయ పద్ధతులద్వారా నీటిసరఫరాఅయ్యే విధంగాచూడాలి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండాలి.
నిఘా విభాగం అప్రమత్తం కావాలి -సి.హెచ్.సాయిరుత్విక్, నల్గొండ
తెలుగు రాష్ట్రాల్లో అంతరాష్ట్ర, విదేశీ దొంగల హల్చల్ పెరిగి పోతోంది.చిన్నపాటి నేరాలు మొదలుకొని హత్యలకు బరితెగిస్తు న్న ఈ దొంగల ముఠా పట్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడచిన అయిదేళ్లలో పలు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసినా కొత్త ముఠాలు రాష్ట్రాలలోకి ప్రవేశిస్తుండటం ఆందోళనకర పరిణామం. ఇళ్లకు ఉన్న తాళాలు పగుల గొట్టడం,చైన్ స్నాచింగ్‌లు, బ్యాంకు దోపి డీలతోపాటు ఈ ముఠాలు సైబర్ నేరాలు, వైట్‌కాలర్ నేరాలకు కూడా పాల్పడుతున్నారు.నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో నేరస్తుల బదలాయింపు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం లేకపోవడం వలన భారీ దోపిడీలకు పాల్పడి నకిలీ పాస్‌పోర్టులతో ఈ దేశాలకు వెళ్లిపోతున్న సంఘటనలు కూడా అనేకం జరుగుతున్నాయి. ఈ విషయంలో నిఘా విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలి.
నిరుద్యోగ సమస్యను నివారించాలి-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా
దేశ ఆర్థికవృద్ధిపై కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించిన వివరాలు అను మానస్పదంగా ఉన్నాయి. ఇంజినీరింగ్పాసైన వారు ఉద్యోగాలు లేక ఎనిమిది వేలకు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఫ్లాగ్షిప్ పథకం, ఆయుష్మాన్‌భవ పథకానికి 6500 కోట్లు కేటాయిస్తే అందులో మూడువేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. వరుసగా ఆరవ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధిరేటు పడిపోయింది. పెద్ద నోట్ల రద్దుకారణంగా ఇరవైవేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి.ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, వైద్యసేవలు, భవన నిర్మాణరంగాలుకుదేలయ్యాయి.వచ్చే ఆర్థికసంవత్సరానికి ఆహా ర, వ్యవసాయ రాయితీలను ఏకంగా లక్ష కోట్లు తగ్గించేశారు. ఆహారపదార్థాల ధరలుఒక్కసారిగా పెరిగిపోయిపేద, మధ్యతర గతి వారిపై భారం పడింది.
వ్యాపార సముదాయాలు నిర్మించాలి -సి.ప్రతాప్, శ్రీకాకుళం
రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో వీధి వ్యాపారులు ఉన్నారు. అధిక శాతం వీధుల్లో సంచరిస్తూ వ్యాపారం చేస్తే, ఇతరులు రోడ్ల కూడళ్లపై, ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక అంగళ్లు ఏర్పాటుచేసి వ్యాపారాలుచేస్తుంటారు.వీరివలన ట్రాఫిక్ జామ్, రోడ్డుప్రమాదాలు సంభవిస్తుంటాయి.కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన కార్యక్రమా న్ని ఆసరాగా చేసుకొని ఎన్యూఎల్ఎం నిధులతో వీధి వ్యాపా ర సముదాయాలను నిర్మించి వారికి భరోసా కల్పించాలి.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/