ప్రజాతీర్పుతోకాదు..కాంగ్రెస్‌ దయతోనే సీఎం అయ్యా!

        ప్రజాతీర్పుతోకాదు..కాంగ్రెస్‌ దయతోనే సీఎం అయ్యా!

KUMARA SWAMY
KUMARA SWAMY
  • కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి
    బెంగళూరు: ఆరున్నరకోట్ల కర్నాటక ప్రజల తీర్పుతో అధికారంలోనికి రాలేకపోయానని, కేవలం కాంగ్రెస్‌ సానుభూతిపైనే ముఖ్యమంత్రిపగ్గాలు చేపట్టానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వెల్లడించారు. రాష్ట్రప్రజలు తనను, తన పార్టీనిసైతం తిరస్కరించారని, అయినా తాను భారీ మెజార్టీతో వస్తామని ఆశించామని చెప్పారు. తన పార్టీకి ఎన్నికల్లో పూర్తి మెజార్టీని రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదని ఆయన స్పష్టంచేసారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఇతర కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళూతూ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ తనకు అత్యంత ప్రాధాన్యతాంశమని, అమలులో విఫలం అయితే తాను రాజీనామాచేస్తానని అన్నారు. కొందరురైతులు, రైతురనాయకులనుంచి కూడా తాను వ్యతిరేక వ్యాఖ్యలు విన్నానని, ఎంతమంది తనకు మద్దతిచ్చారని ఆయనప్రశ్నించారు. నాప్రభుత్వం ఒక స్వతంత్ర ప్రభుత్వమని, తాను రాష్ట్రప్రజలనున స్పష్టమైన మెజార్టీతో గెలిపించాలని కోరానని, దీనివల్ల ఏ ఒక్కపార్టీపై ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటుచేయాలనరి భావించామన్నారు. అయితే ప్రస్తుతం తాను కాంగ్రెస్‌ పార్టీ దయాబిక్ష కారణం వల్లనే ముఖ్యమంత్రి అయ్యానని, ఆరున్నరకోట్ల ప్రజల తీర్పుతో కాదని కుమారస్వామి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా తనకు కొన్ని బాధ్యతలు ఉంటాయని, అయితే తాను రైతురుణమాఫీపై స్పష్టంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. బిజెపి, ఇతర రైతునాయకులపై తీవ్రస్థాయిలో విమర్శిస్తూ తనపై వత్తిడితెచ్చేందుకు ఎలాంటి రైతుసంఘాలు అవసరం లేదని అన్నారు. బిజెపికంటే రైతులసంక్షేమంకోసం పనిచేసేందుకు ఒక అడుగు ముందులోనే ఉన్నానన్నారు. రైతురుణమాఫీచేయకపోతే రాజీనామా చేయాలని కోరే అవసరం లేదని, అదేకనుక విఫలం అయితే తనంతతానే రాజీనామాచేస్తానని చెప్పారు. రైతు రుణమాఫీ తన తొలిప్రాధాన్యత అని వారం రోజులపాటు వేచి ఉండలేరా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికింకా మంత్రివర్గమే ఏర్పాటుకాలేదని, అప్పుడే డిమాండ్లు ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారంరోజులపాటు వేచి ఉండాలని ఆయన కోరారు. మాఫీకి అవసరమైన విధివిధానాలు రూపొందుతున్నాయని, కేవలం సహకార సొసైటీలనుంచే కాదని, జాతీయ బ్యాంకుల్లోసైతం తీసుకున్న రుణాలు మాఫీచేస్తారన్నారు. రైతు రుణమాఫీ వెంటనే చేపట్టాలని డిమాండ్‌చేస్తూ బిజెపి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బంద్‌పిలుపుపట్ల ఆయన తీవ్రనిరసన వ్యక్తంచేసారు. ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినాసరే తమ సంకీర్ణభాగస్వామిని సంప్రదించాలిస ఉందని కుమారస్వామి వివరించారు. ఆర్ధికశాఖ తమకు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ పట్టుబడుతున్నదన్న ప్రస్తావనపై ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్‌ సహజమేనని,పార్టీలో కొందరు ఆర్ధికశాఖ తమ వద్ద ఉంటే మరింత పటిష్‌టంగాను సమర్ధవంతంగాపనిచేస్తామని భావించి ఉండవచ్చన్నారు. అలాగే ఆర్ధిక, విద్యుత్‌శాఖలు, జలవనరులు వంటి కీలక శాఖలపై కాంగ్రెస్‌ పార్టీ తమకు కావాలని పట్టుబడుతున్న వైనం తెలిసిందే. ఇప్పటికే ఉపముఖ్యమంత్రికి హోంశాఖ కేటాయించాల్సివస్తున్నందున మొత్తంగా ఐదు కీలకశాఖలకు మాత్రమే జెడిఎస్‌ ఒప్పుకుంది. ఇదేవిషయమై ఢిల్లీకి బయలుదేరిన కుమారస్వామి ప్రధానిమోడీని కలవడంతోపాటు కాంగ్రెస్‌ పెద్దలను సైతం కలుసుకుని ప్రస్తావించనున్నట్లు కనిపించింది. గతంలో జడిఎస్‌కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినపుడు జెడిఎస్‌కు ఆర్ధికశాఖ ఇచ్చిందని, ముఖ్యమంత్రిపదవిని కాంగ్రెస్‌చేపట్టిందని, అయితే ఇపుడు జెడిఎస్‌కు నేరుగాముఖ్యమంత్రిపదవినే ఇచ్చామని, అందువల్ల కాంగ్రెస్‌కుఆర్ధికశాఖ మరికొన్ని కీలకపదవులు అవసరమని పట్టుబడుతున్నారు. ఇదేవిషయమై కాంగ్రెస్‌హైకమాండ్‌ను కలిసి చర్చలుజరిపేందుకు సైతం కుమారస్వామి సన్నద్ధం అయ్యారు. అలాగే కాంగ్రెస్‌పరంగా డికె శివకుమార్‌, ఆర్‌వి దేశ్‌పాండే, ఎంబి పాటిల్‌ వంటివారు గతంలో తామునిర్వహించిన శాఖలనే మళ్లీ పట్టుబడుతుండటంతో కొంతమేర ముఖ్యమంత్రికి తలనొప్పులే ఎక్కువయినట్లు స్పష్టం అవుతోంది.