ప్రజాక్షేమానికి తెదేపా శాశ్వత అంకితం

BABU
AP CM Chandra babu Naidu

ప్రజాక్షేమానికి తెదేపా శాశ్వత అంకితం

విజయవాడ: ప్రజల సంక్షేమ అభివృద్ధికి శాశ్వతంగా తెదేపా ఉండాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.. శుక్రవారం ఇక్కడ తెదేపా రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలు ప్రజలుకు మెరుగైన సేవలు అందించేలా ఉండాలన్నారు.. సంక్షేమ పథకాలన్నీ పకద్బందీగా నిర్వహిస్తున్నామని, ఏ ఒక్క లబ్దిదారుడికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు.. సంక్షేమ కార్యక్రమాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు.. ప్రతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.. సరేగా కింద రూ.5,700 కోట్లు ఖర్చుపెట్టిన ఏకైక రాష్ట్రం మనదే అన్నారు.

పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే బలం

తెదేపా అభివృద్ధికి కార్యకర్తలే బలం అని అనఆనరు.. ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, కార్యకర్తల కృషి అవసరమన్నారు.. ప్రజలు మనపై విశ్వాసం ఉంచి గెలిపించారన్నారు.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తేనే వారికి నమ్మకం కలుగుతుందన్నారు.. 35 ఏళ్లుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నామన్నారు. పార్టీకి అన్ని వేళలా కార్యకర్తలు వెన్నంటి ఉన్నారని చెప్పారు..