ప్రజల సహకారంతోనే ప్రక్షాళన యుద్ధం

ప్రజల సహకారంతోనే ప్రక్షాళన యుద్ధం
న్యూడిల్లీ: దేశ ప్రజల సహకారంతో సాగిన ప్రక్షాళన యుద్ధమిదని, ఈ యుద్ధంలో విజయం ప్రజలదే అని ప్రధాని మోడీ అన్నారు. జాతి నుద్దేశించి ఆయన శనివారం రాత్రి మాట్లాడారు..పెద్దనోట్ల రద్దు ద్వారా దీర్ఘకాల ప్రయోజనాలు సాధిస్తామన్నారు.. దేశ చరిత్రలో పెద్దనోట్ల రద్దు చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.. అవినీతిపై ప్రారంభించిన ఈ యుద్ధంలో వెనకడుగు వద్దని ఈ 50 రోజుల్లో తనకు వేలాది లేఖలు అందాయని మోడీ తెలిపారు.. నోట్ల రద్దు కారణంగా నగదు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడిన మాట వాస్తవమని చెప్పిన మోడీ ప్రజలు ఎంతో సహనంతో ఈ ఇబ్బందులును ఎదుర్కొన్నారని అన్నారు.
మంచి భవిష్యత్తుకు పునాదులు
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో భయపడిన వారు నల్లధనం ఉన్న అక్రమార్కులకే కానీ, నిజాయితీపరులైన ప్రజలు కాదని మోడీ అన్నారు. ఈ మహాశుదంధ యజ్ఞానికి మద్దతుగా నిలిచిన 125 కోట్ల మంది భారతీయులకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.. బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అవినీతి పరులకు శిక్షలు పడే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
సమాంతర వ్యవస్థను నడిపిన రూ.1000, రూ.500 నోట్లు
గతంలో వెయ్యి , అయిదొందలు నోట్లు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపాయని అన్నారు.. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు కొరత వల్ల ప్రజల ఇబ్బందుల కన్నా అధిక ధనంవల్ల తలెత్తిన ఇబ్బందులు అధికమని అన్నారు.
మధ్యతరగతి ప్రజలకు గృహనిర్మాణం కోసం వడ్డీలేని రుణాలు
ఇంతకాలం బయటకు రాని నల్లధనం పెద్దనోట్ల రద్దు ద్వారా బయటకు వచ్చిందని, ప్రధాని అన్నారు.. పేద , మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని బ్యాంకులను కోరుతున్నానని అన్నారు.. గరీబ్ కల్యాణ్ పథకం కింద పేదలను ఆదుకునేలా బ్యాంకులు పనిచేయాలాన్నరు. పేదల కోసం రెండు కొత్త గృహనిర్మాణ పథఖాలను చేట్టనున్నట్టు తెలిపారు. పట్టణ పేదల కోసం రెండు గృహనిర్మాణ పథకాలను మోడీ ప్రకటించారు.. అలాగే గ్రామీణ పేదల కోసం పెద్ద ఎత్తు గృహాల నిర్మాణం చేపడతామన్నారు. పేద, మధ్యతరగతి వారికి గృహనిర్మాణం కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.
చిన్నవ్యాపారులకు రూ.కోట్ల వరకూ రుణాలు
చిన్నవ్యాపారులకు రూ.2కోట్ల వరకూ రుణాలు అందిస్తామన్నారు.. గ్రామీణ ప్రాంతాఓ్ల సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను రెండునెలల వరకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.. కిసాన్ క్రెడిట్ కార్డులను మూడు నెలల్లో రుపే కార్డులను మార్పుచేస్తామన్నారు. రైతులుకూడ నగదురహిత లావాదేవీలు నడిపేలా ప్రోత్సహిస్తామన్నారు. గర్హిణీలకు వైద్య సహాయంకోసం రూ.6వేలు వారి ఖాతాలో జమచేస్తామని చెప్పారు.
సీనియర్ సిటిజన్లకు రూ.7.5 లక్షల లోపు డిపాజిట్లపై పదేళ్ల వరకు 8శాతం వడ్డీ
సీనియర్ సిటిజన్లకు రూ.7.5 లక్షల లోపు డిపాజిట్లపై పదేళ్లవరకు 8శాతం వడ్డీ ఉంటుందన్నారు.. సీనియర్ సిటిజన్ల కోసం కొత్తపథకాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు..
అన్నివర్గాలు భీమ్యాప్తో అనుసంధానం కావాలి
అన్ని వర్గాల ప్రజలు భీమ్ యాప్‌తో అనుసంధానం కావాలని అన్నారు..
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ప్రయోజనాలు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని తెలిపారు. ఆ దిశగా ఆలోచిస్తామన్నారు.