ప్రజల మనిషి ప్రకాశం పంతులు

                        ప్రజల మనిషి ప్రకాశం పంతులు

TANGUTURI PRAKASHAM
TANGUTURI PRAKASHAM

నిజమైన నేతగా, నిస్వార్థ ప్రజాసేవకుడిగా ప్రజల హదయాలలో శాశ్వతంగా నిలిచే వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులంటే అతిశయోక్తి కాదు. ‘పట్టుదలకు మారుపేరుగా త్యాగానికి మరో పేరుగా ప్రకాశం పంతులు నిలుస్తారనడంలో సందేహం లేదు. స్వాతంత్య్ర సమరయోధు లుగా, స్వరాజ్య పత్రిక నిర్వాహకులుగా, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా, న్యాయవాదిగా, రాజమండ్రి మునిసిపల్‌ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ప్రకాశంపంతులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో ఉన్న మేనమామల ఇంట 1872 ఆగస్టు 23న సుబ్బమ్మ, గోపాలకష్ణయ్య దంపతులకు జన్మించారు. ప్రకాశం తండ్రి ఉద్యోగం చేస్తూ మరణించడంతో తల్లి పుట్టింటికి చేరింది. కొంత కాలానికి ఆమె పుట్టింటికి భారం కాకూడదనుకొని ఒంగోలు చేరి ‘పూటకూలి పెట్టడం ద్వారా పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.

ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వాటిల్లినా భయపడక, బాధపడక ధైర్యంగా పిల్లల్ని పోషించింది. ప్రకాశం గురువు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు పాత్ర ప్రకాశం ఎదుగులలో ఎంతో వుంది. ఒంగోలులోని మిడిల్‌ స్కూల్‌లో చదివే రోజుల్లోనే నాయుడు ప్రకాశానికి పరిచయం కావడం 1887లో ఆయనతోనే ప్రకాశం రాజమండ్రి చేరాడు. 1891లో ఎఫ్‌.ఏ. పరీక్షలో ప్రకాశం విజయం సాధించాడు. నాయుడుగారే ఆయనకు సర్వ విధాల సహకరించారు. రాజమండ్రిలో నాయుడు నాటక సమాజాన్ని స్థాపించారు. ప్రకాశం వివిధ పౌరాణిక నాటకాలలో స్త్రీ, పురుష వేషాలు వేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. కొన్నాళ్లపాటు రాజమండ్రి, ఒంగోలు పట్టణాలలో న్యాయవాదిగా పనిచేశారు.1904వ సంవత్సరం ఇంగ్లాండు వెళ్లిన ప్రకాశం 1906లో బారిష్టర్‌గా భారత్‌కు తిరిగి వచ్చారు. 1907లో చెన్నై హైకోర్టులో లాయర్‌గా అటు పేరు, ఇటు డబ్బు రెండంటిని సంపాదించుకొన్నాడు.

ధనాన్ని దుర్వినియోగం చెయ్యకుండా భూముల్ని కొన్నాడు, మేడల్ని కట్టాడు ప్రకాశం. భారత జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ పిలుపు మేరకు 1921 జనవరి 24న ”నేను ఈ రోజు నుండి బ్రిటీష్‌వారి కోర్టులను బహిష్కరిస్తున్నాను అని లక్షలాది రూపాయలను అందిస్తున్న న్యాయవాద వత్తికి స్వస్తి చెప్పడమే కాకుండా తాను సంపాదించిన ధనాన్ని సైతం దేశంకోసం ఖర్చు చేస్తానని చెప్పడమే కాకుండా చేతలలో ఆచరించి అన్న మాటకు కట్టుబడిన ప్రజాసేవకుడు ప్రకాశం పంతులు. 1921లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగా, అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడుగా బాధ్యతల్ని చేపట్టారు. 1921లోనే జాతీయోద్యమ ప్రచారానికి ”స్వరాజ్యం అనే పత్రికను ప్రారంభించారు. మొదట అది ఆంగ్లంలో ప్రారంభించి, తర్వాత తమిళ, తెలుగు భాషలలో వెలువరించారు. గాంధీజీ ఉద్యమానికి బాసటగా నిలవడమే కాకుండా జనాన్ని జాగతం చెయ్యడంలో పత్రిక పాత్ర ఎంతైనా వుంది. వివిధ కారణాల వల్ల ‘స్వరాజ్యం పత్రిక 1935లో ఆగిపోయింది. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా పత్రికకోసం హారతికర్పూంలా హరించుకుపోయింది. ప్రకాశం విలువైన ఆస్తులన్నీ పత్రికకోసం పోగొట్టుకొన్నారు.

1928 ఫిబ్రవరి 3న చెన్నైలో ‘సైమన్‌ గో బాక్‌ అనే నినాదంతో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేకోద్యమ నిరసన ప్రదర్శనలో పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని చుట్టూ పోలీసులు ఉ న్నారు. ఎవ్వరినీ అతని దగ్గరకు వెళ్లకుండా అడ్డు కుంటున్నారు. అంతలో ప్రకాశంముందుకొచ్చారు. వీరిని పోలీసులుఅడ్డుకు న్నారు. ”నన్ను వెళ్లనీ యండి, మరణించిన వ్యక్తిని చూడాలి అని అడిగారు ప్రకాశం. ”వెళ్లడానికి వీలు కాదు. ముందుకొస్తే కాల్చ వలసొస్తుంది అని హెచ్చరించారు పోలీసులు. ఆవేశంతో ప్రకాశం తన గుండెని చూపుతూ ”ధైర్యముంటే నన్ను కాల్చండి అన్నాడు. ఏం చెయ్యలేక పోలీసులు తుపాకుల్ని దించి ప్రకాశంను ముందకు వెళ్లనిచ్చారు. ఈ సంఘటనతో ప్రజలంతా ”ఆంధ్రకేసరి అని ప్రకాశంగారిని కొనియాడారు. ధైర్య సాహసాలకు ప్రకాశం పెట్టింది పేరు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఉప్పు మీద పన్ను విధించడం తో అది పేదలకు ఎంతో నష్టం కలిగించింది. దానిని వ్యతిరేకించా లని గాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. దానిలో కూడా పంతులుగారు పాల్గొని ఏడాది జైలుశిక్షను అనుభవించారు.

1932లో శాసనోల్లంఘనలో ఏడు నెలలు, 1940 వ్యక్తి సత్యాగ్రహంలో సంవత్సరంపాటు కారాగార శిక్ష, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో మూడు సంవత్సరాల నిర్భందాన్ని ప్రకాశం అనుభవించారు. ప్రకాశం పంతులు ఏ పదవిలో వున్నా ప్రజాసేవే పరమావధిగా భావించేవారు. ప్రజా ప్రతినిధికి నిర్వచనం ప్రకాశం గారే అనడం అతిశయోక్తి కాదు. ఆయన చేపట్టిన మొట్టమొదటి పదవి.. రాజమండ్రి పురపాలక సంఘాధ్యక్షుడిగా 1903- 1904లలో పని చేశారు. 1926లో కేంద్ర శాసనసభ(ఢిల్లీ)కి కష్ణా గోదావరి జిల్లాల నుండి కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపుతో రాజీనామా చేశారు. తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా రాజీనామా చేశారు. నాలుగేళ్ల కాలంలో ఆయన కేంద్ర శాసనసభలో చరిత్ర సష్టించారు. ఆయనకున్న అపారమైన న్యాయశాస్త్ర పరిజ్ఞానంతో సర్కార్‌కి ఒణుకు పుట్టిం చారు. 1937, 1946లో మద్రాసు శాసనసభకి ఎన్నికైనారు. 1937లో రెవిన్యూ మంత్రి అయ్యారు.

రెవిన్యూ మంత్రిగాఆయన గాంధీ ఉద్యమంలో ఉగ్యోగాలు కోల్పోయిన గ్రామాధికారులకు తిరిగి ఉద్యోగాలిచ్చారు. గ్రామీణాభివద్ధికి బాగా కషి చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండేవారు. ప్రకాశం 1946 మార్చిలో అవిభక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమం త్రిగా 11 నెలలు పనిచేశారు. 1950లో కాంగ్రెసు నుండి వైదొలగి ‘ప్రజాపార్టీని స్థాపించారు. అమరజీవి పొట్టిశ్రీరాముల ఆత్మార్పణం ఫలితంగా 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీనికి మొదట ముఖ్యమంత్రిగా ప్రకాశంగారే. పదవిలో ప్రకాశం ఉన్నది కేవలం పదమూడు నెలలు మాత్రమే. కానీ ప్రజలకు ఉపకరించే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీరి పదవీ కాలంలోనే తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడగా, నాగార్జునసాగర్‌, కష్ణా నదిపై కట్టిన బ్యారేజ్‌(ప్రకాశం బ్యారేజ్‌)కి పునాదులు పడ్డాయి.

మద్యనిషేధంపై ప్రభుత్వ తీర్మానం వీగిపోవడంతో ప్రకాశం పదవికి రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో, ఏమి చెయ్యాలో ప్రకాశంగారి నుండి నేర్చుకోవాలి. స్వార్థాన్ని పక్కన పెట్టి సంకుచిత రాజకీయాల్ని తిరస్కరించి, ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ప్రజల మనిషిగా ప్రకాశం ప్రకాశించారంటే అతిశయోక్తి కాదు. ప్రజల కోసం జీవించిన ప్రకాశం పంతులు 1957 మే 20వ తేదీన అంతిమ శ్వాస విడిచారు. 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ప్రకాశం జిల్లాగా పేరు పెట్టడం జిరగింది. ఆంధ్రకేసరిగా టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిపోతారు.
– ఆచార్య గిడ్డి వెంకటరమణ