ప్రజల్లో జీవితాల్లో కాంతులు వెదజల్లాలి: మంత్రి హరీష్‌రావు

T.Harishrao
T.Harishrao

సిద్ధిపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అమలై ప్రజల ముఖాల్లో నూతన కాంతులు వెదజల్లాలని కోరుకున్నట్లు
మంత్రి హరీష్‌ అన్నారు. కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని సిద్ధిపేట శ్రీవెంకటేశ్వర ఆలయంలో సప్త సహస్ర దీపోత్సవం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజ అనంతరం మంత్రి స్పందిస్తూ
భగవంతుడి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు
చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరతగతిన పూర్తి అయి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చి సస్యశ్యామలం కావాలని
కోరుకున్నట్లు వెల్లడించారు.