ప్రజలు బాగుపడొద్దు అనేదే కాంగ్రెస్ నీతిః కెటీఆర్‌

TS Minister KTR
TS Minister KTR

హైద‌రాబాద్ః క‌ల్వకుర్తి ప్రజలు రాజకీయ చైతన్యానికి ప్రతీక అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్‌ లాంటి నేతను ఓడించి రాజకీయ చైతన్యాన్ని రగిలించారని ఆయన వివరించారు. పాలమూరు పచ్చబడే వరకు వెనకడుగు వేయమని అన్నారు. ఫార్మా సిటీకి కల్వకుర్తి ఎమ్మెల్యే అడ్డం పడుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే వంశీచంద్ ప్రగతి నిరోధకుడుగా మారారన్నారు. ప్రజలు బాగుపడొద్దు అనేదే కాంగ్రెస్ నీతి అని ఆయన చెప్పుకొచ్చారు.