ప్రజలతో ఇక కెటిఆర్‌ ముఖాముఖి

ప్రజలతో ఇక కెటిఆర్‌ ముఖాముఖి
హైదరాబాద్‌: అమెరికా తరహాలో టౌన్‌హాల్‌ సమావేశాలు నిర్వహించటానికి తెలంగాణ మంత్రి కెటిఆర్‌ నిర్ణయించారు. ఈ విధంగా మంగళవారం నుంచి ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో సాయంత్రం తొలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పనున్నారు.