ప్రజలకు మంచి చేసేందుకే కూటమి

కొడంగల్: కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కొడంగల్ కొదమసింహమని టిజెఎస్ అధినేత కోదండరాం కొనియాడారు. కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడుతూ..ప్రజలకు మంచి చేసేందుకే ఏకమయ్యాం. కేసిఆర్ లాగా మాటలు చెప్పం. గెలిస్తే తెలంగాణను అభివృద్ధి పథాన నడిపి చూపిస్తాం అని అన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, యువతకు బతుకుదెరువు చూపిస్తాం అని వాగ్ధానం చేశారు. వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఫాంహౌస్‌లో సేద తీరుతున్న కేసిఆర్‌ను, ఫాంహౌస్‌కే పరిమితం చేయాలని కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు.