ప్రజలకు జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

Y S Jagan
Y S Jagan

శ్రీవిళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ఇంటింటా సంతోషాలు నిండాలని వైఎస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకుని రావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆక్షాంక్షించారు. ఈ తెలుగు సంవత్సంలో సకాలంలో వానలు పడి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాడిపండటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని సకల వృత్తుల పరిడవిల్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలు మెండుగ అందులకోవాలని ఆక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకుని రావాలని అభిలషించారు.