ప్రచారకర్తగా రణ్‌వీర్‌సింగ్‌

SWISS1
Ranveer Singh

ప్రచారకర్తగా రణ్‌వీర్‌సింగ్‌

ముంబై, నవంబరు 6: స్విట్జర్లాండ్‌ పర్యాటకరం గానికి ముఖ్యప్రచారకర్తగా బాలివుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ నియమితులయ్యారు. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్‌కు నిర్వహించిన పర్యటన లో ఎంతో ముగ్ధుడయినట్లు ఆయన వివరిం చారు. అంతేకాకుండా స్విస్‌ప్రభుత్వం రణ్‌వీర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గాఎంచుకుంది. భారత్‌ స్విట్జ ర్లాండ్‌ పర్యాటకరంగ డైరెక్టర్‌ క్లాడియో జెంప్‌ మాట్లాడుతూ డైనమిక్‌ యువకుడైన రణ్‌వీర్‌ స్విట్జర్లాండ్‌కు మరింతభారత పర్యాటకులు వచ్చే విధంగా తమకు అనువుగా ఉంటారని అన్నారు. భారత్‌లోని స్విట్జర్లాండ్‌ పర్యాటకశాఖ డిఫ్యూటీ డైరెక్టర్‌ రితుశర్మ మాట్లాడుతూ పూర్తి హాలిడే విశ్రాంతికోసం స్విట్జర్లాండ్‌ ఎంతో అనువైన ప్రాంతమని రోజులకొద్దీ వేచి ఉన్నప్పటికీ తరగతి అనుభూతి కలుగుతుందని అన్నారు. స్విట్జ ర్లాండ్‌పట్ల భారతీయ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందించి తమపర్యా టకరంగ వృద్ధి కోసం బాలివుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ను ప్రచార కర్తగా ఎంపికచేసామని రితుశర్మ పేర్కొన్నారు.