ప్రగతి పద్దులు షురూ

ప్రగతి పద్దులు షురూ
బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తుచేస్తున్న ముఖ్యమంత్రి సిఎం
కెసిఆర్ మార్కు ఉండేలా ఆర్ధిక శాఖ ప్రణాళిక
కేంద్ర పన్నుల వాటాపై స్పష్టత కోసం ఎదురుచూపు
వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు
నీటిపారుదల, బిసి సంక్షేమానికి కేటాయింపులు పెంపు
హైదరాబాద్ : వచ్చే 2018-19 ఆర్ధిక సంవత్సర వార్సిక బడ్జెట్‌కు పూర్తి రూపం ఇచ్చేందుకు ఆర్ధికశాఖ కసరత్తును వేగంచేసింది. మార్చి 12న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవు తున్ననేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై సమీక్షల వేగం పెరిగింది.అన్ని శాఖల నుంచి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను క్రోడీకరించి అందు బాటులో ఉన్న ఆర్ధికవనరుల మేరకు మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. బడ్జెట్ రూపకల్ప నపై సిఎం కెసిఆర్ మార్కు పూర్తి స్థాయిలో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు.
అన్నిశాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అందినక్రమంలో ఆర్ధికశాఖతీవ్రకసరత్తు చేస్తోంది. ఈసారి ప్రతిశాఖ నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా అందాయి.వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం, చేయాల్సిన వ్యవయాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలకు జాగ్రత్తగా తుది రూపం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం 2017-18 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.1,49.646 కోట్లుగా ప్రతిపాదించింది.
ఇందులో ప్రగతి పద్దు రూ.88వేల071 కోట్లు, కాగా నిర్వహణ వ్యయంకింద రూ.61వేల కోట్లను ప్రతిపాదించారు. నిర్వహణ వ్యయం కంటే ప్రగతి పద్దు ఎక్కువగా చూపడం విశేషం. ఫిబ్రవరి నెల ఒకటో తేదిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మార్చిలో రాష్ట్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతు న్నందున అంతకంటే ముందే రాష్ట్రానికి వచ్చే నిధులు, కేంద్ర పన్నుల్లో వాటాలపై ఓ అంచనా వస్తుంది.ఈసారి సాధారణ,వ్యవసాయ బడ్జెట్లతో పాటు సంక్షేమానికి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రతపా దించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బీసీల అభివృద్దికి, సంక్షేమానికి కేటాయింపులు పెరగనున్నాయి. పంచాయతీలకు నేరుగా బడ్జెట్ లోనే నిధులు కేటాయిస్తామని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.8వేల చొప్పున పంటల పెట్టుబడి పథకానికి కూడా కేటాయింపులు చేయనున్నారు. రైతు రుణమాఫీ పూర్తికావడంతో ప్రభుత్వం రైతులకు పంటల పెట్టుబడిని ఇవ్వనున్నది. వచ్చే బడ్జెట్లో కూడా ప్రగతి పద్దు సైజు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వచ్చే బడ్జెట్లోనే ప్రగతి పద్దులో బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది.బీసీల సంక్షేమానికి ఈ ఏడాది రూ.5,071 కోట్టు కేటాయించింది. వచ్చే వార్షిక బడ్జెట్లో దీనిని భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ,ఎస్టీల అభివృద్ది కోసం నిధులను వెంట వెంటనే ఖర్చు చేస్తున్నారు. పైసాపైసాకు పక్కాగా లెక్క చెబుతు న్నారు. బడ్జెట్లో కేటాయించిన దానికంటే ఎక్కువ నిధులను వెచ్చిస్తున్నారు.