ప్రగతి నివేదన సభ తుస్సుమంది

UTTAM KUMAR REDDY
UTTAM KUMAR REDDY

ప్రగతి నివేదన సభ తుస్సుమంది

సభ నిర్వహించింది అవినీతి సొమ్ముతో కాదా?: టి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందనీ, కేసీఆర్‌ ప్రసంగం తుస్సుమనిందని టీ పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సభతో ప్రపంచం నివ్వెరపోయేలా కేసీఆర్‌ అవినీతిని గమనించిందని పేర్కొన్నారు.కేసీఆర్‌ హఠావో… తెలంగాణ బచావో అనే నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతుందన్నారు.ఆదివారం రాత్రి తన నివాసంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ ఇవ్వమంటే ఇవ్వరు కానీ బెదిరించి చట్టవిరుద్ధంగా సభ కోసం ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను తీసుకున్నారని విమర్శిం చారు. హోర్డింగ్‌లు పెట్టవద్దన్న కేటీఆర్‌ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు పెట్టారనీ, అధికారులు ఈ రకమైన వివక్ష చూపించడం శోచనీయమన్నారు. ప్రగతి నివేదన అని చెప్పి నిర్వహించిన సభలో డబుల్‌ బెడ్‌ రూమ్‌, ముస్లిం, గిరిజనుల 12 శాతం రిజర్వేషన్లు, మూడెకరాల భూమి ప్రస్తావనే లేదనీ, కేసీఆర్‌ సభలో దొంగ మాటలు మాట్లాడారనీ, ఆయనకు ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై నిబద్ధత లేదని విమర్శించారు. సీఎం పదవిని చేపట్టాక రాష్ట్రంలో కేసీఆర్‌ ఒక్క విద్యుత్‌ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదనీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సొంతంగా ఒక్క యూనిట్‌ విద్యుత్‌నుకూడా ఉత్పత్తి చేయలేద న్నారు.

అవన్నీ గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పూర్తి చేసిన విద్యుత్‌ ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. అది మిషన్‌ భగీరథనో… కమీషన్‌ భగీరథనోఅని పేర్కొంటూమిషన్‌ భగీరథ కూడా 10 శాతం ఇళ్లకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. గడువు సమయానికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నాడనీ, ప్రగతి నివేదన సభకు పెట్టిన రూ. 300 కోట్లు ప్రాజెక్టుల పేరుతో దోచకున్న అవినీతి సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. జోనల్‌ విధానంపై ప్రధాని మోడీని ఇస్తావా…చస్తావాఅని సాధించానని చెప్పుకున్న కేసీఆర్‌ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకొ చ్చారా ? ముస్లిం, మైనార్టీల రిజర్వేషన్లపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్లకు కేంద్రం అంగీకరించకపోతే భూకంపం సృష్టిస్తానన్న కేసీఆర్‌ ఈ విషయంపై శాసనసభలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.