ప్రగతి నివేదన సభతో కాంగ్రెస్ నేతల్లో వణుకు

ఖమ్మం: ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెట్టబోయేవన్నీ ఆవేదన సభలే అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా కూడా చూడరన్నారు. ప్రగతి నివేదన సభతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుడుతుందని తెలిపారు. దేశంలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ సభలుపెట్టిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పదవ తరగతి విద్యార్ది చదవకుండా పరీక్ష రాయడానికి వెళ్లిన మాదిరిగా కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో మాట్లాడానికి భయపడుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు.