ప్రగతి నివేదన ఒక ఫ్లాఫ్‌ షో

DK Aruna
DK Aruna

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహించిన ప్రగతి నివేదన సభకు కేవలం రెండున్నర లక్షల మందే వచ్చారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీకె అరుణ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రగతి నివేదన సభ ఫ్లాఫ్‌ ఫోగా మిగిలిందన్నారు. ప్రజలు విహారయాత్రకు వెళ్లినట్లు సభకు వచ్చి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. కేసిఆర్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి నిన్నటి సభే నిదర్శనమని అన్నారు. తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు కేసిఆర్‌పై గళం విప్పాలని సూచించారు. ముందస్తుకు వెళ్తే ఓడిపోతానని కేసిఆర్‌కు అర్ధమైందని డీకె అరుణ అన్నారు.