ప్రకృతి వైద్యం మేలు!

Eating
Nature Care

ప్రకృతి వైద్యం మేలు!

మన చేతుల్లో ఏముంది. ఒళ్లు అదే పెరుగు తోంది. ఏం చేస్తాం! ఒక తల్లి నిర్లిప్తంగా ఇచ్చే సమాధానం. నిజానికి బరువ్ఞ తగ్గడం అన్నది ఒక రోజో, ఒక్కసారిగా చేసే ప్రయత్నమో కాదు. జీవితమంతా అదో ధ్యేయమనుకొని మనం చేసే నిత్యప్రక్రియ. ఒక బుతువుగా కొద్దికాలానికో పరిమితమైనది కాదు. ఆహారం మానేస్తే ఒళ్లు రాదు. సన్నగా చక్కగా ఉంటాం అనుకొని అన్నీ ఉన్నా అన్నం తినటానికి ఆలోచిస్తారు చాలామంది కాలేజీ అమ్మాయిలు. లేదండీ! అసలు అన్నం బాగా తగ్గించేశాను. అయినా ఈ ఒళ్లు తగ్గడం లేదు అంటుంది ఓ ఇల్లాలు. మనం తినే అన్నం వల్ల ఒళ్లు రాదు.

ఉపవాసం బరువ్ఞ సక్రమంగా ఉండటానికి సమాధానమూ కాదు. ఉపవాసాలు నిత్యం చేయడం వల్ల నీరసం, ఆహార సారం లేకపోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధకశక్తి తగ్గి అనేక ఇతర వ్యాధులు, బలహీనత ప్రవేశించే అవకాశాన్ని మనం ఇస్తున్నాం అని గ్రహించండి.మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే అద్భుత పోషకవిలువలు ఉండీ అధిక బరువును కరిగింపజేసే వస్తు సముదాయాల్ని భగవంతుడు భద్రపరిచాడు. వాటిని చూడగలిగిన శాస్త్రజ్ఞులు అవేమిటో గుర్తించి చూపించారు మనకి ఆయుర్వేద శాస్త్రరూపంలో. వాటిని వాడుకుంటూ కొంత ఆహారపు అలవాట్లని, కొంత జీవనవిధానాన్ని సవరించుకొని జీవిస్తే ఈ బరువ్ఞ మనకి బరువైన సమస్య కాదు.ఈ మధ్యకాలంలో మధ్య పాశ్చాత్య దేశాల సంస్కృతిలో ఈ సమ్మిళిత జీవన విధానం అనుసరించి ఒంటి బరువ్ఞను తగ్గించుకునే ప్రయత్నం ఆరంభమయింది. మంచి ఫలితాలు ఇస్తున్నాయి. దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. హాలెండు వంటి యూరప్‌ దేశాల్లో ఈ సంస్థలు ఇప్పటికీ చక్కగా పనిచేస్తున్నాయి.

ఎలా గుర్తించాలి

మన బరువుని పెంచేది కొవ్వుపదార్థం. దాన్నే ఫ్యాట్‌ అంటారు. దాన్నే ఆయుర్వేదంలో మేథ అంటారు. ఇది శరీరానికి, మన శరీరంలో శక్తిని దాచే బీరువాలాంటిది. శరీరానికి స్నిగ్ధత్వం కలుగజేసే నూనె లాంటిది. స్వేదం అంటే చెమటని కలుగజేసే డ్రైనేజీ మిషన్‌లాంటిది. మన శరీరానికి ఈ కొవ్వు పదార్థం కావాలి. కాని అది ఎక్కువ కాకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉన్నా ఈ కొవ్వు రక్తనాళాలు, రక్తం, మిగతా భాగాలలో చేరి అనేక ఉపద్రవాలని కలుగచేస్తుంది. ఈ కొవ్ఞ్వ పదార్థం ముఖ్యంగా కడుపులోను, ఎముకలోను ఎక్కువగా చేరుతుంది. అందుకే మీ పొట్ట పెరుగుతోంది అంటే మీ ఒళ్లు పెరుగుతోందని, మీరు ఒబెసిటీ అవుతున్నారని గుర్తు.