ప్రకృతి అందం

బాలగేయం

NATURE
NATURE

ప్రకృతి అందం

 
సాయంకాలం చల్లగాలిలో సముద్రంలో సూర్యుడు అస్తమిస్తుంటే

అరుణ కాంతులు అలల సొగసులు ఎంతో అందం

ఆకాశంలో పక్షుల గుంపుల పరుగులు

చెలకల నుండి పశువ్ఞల మందలు వస్తూ ఉంటే ఎంతో అందం

చేతిలో కొడవలి తలపై గడ్డిమోపుతో వస్తూ ఉంటే ఎంతో అందం

చెరువ్ఞలో చేపలు ఎగురుతూ ఉంటే కప్పలు బెక బెక మని అరుస్తూ ఉంటే

పచ్చని పైరు గాలికి తలలూపుతుంటే ఎంతో అందం

పల్లె పచ్చదనం మా కందం ప్రకృతి శోభ

ప్రతి ఒక్కరికి ఆనందం బ్రహ్మానందం

పల్లెకు ఒక్కసారి రండి చక్కని అనుభూతిని పొందండి

– సామలేటి లింగమూర్తి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా