ప్రకృతితో కలిసి అడుగులు

VENKAIAH
VENKAIAH

ప్రతిఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి జన్మభూమి, మాతృభాషను ఎన్నడూ మరువరాదు భారతావని భవిష్యత్తు అంతా అర్కిటెక్చర్లపైనే ఆధారం పర్యావరణ హితంగా భవన నిర్మాణాలు అవసరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ, ఆగస్టు 23, ప్రభాతవార్త ప్రతినిథి: పర్యావరణ సమతుల్యత పాటించేలా భవన నిర్మాణాలు చేపట్టాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్చర్లదేనని భారత ఉపరాష్ట్రపతి ముప్పరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్కూల్‌ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ 3వ స్నాతకోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఏపి తెలంగాణాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, గురువును ఎన్నడూ మరువరాదన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిని ప్రేమించాలని, ప్రకృతితో కలిసి అడుగులేయాలన్నారు. భావిభారత భవిష్యత్తంతా ఆర్కిటెక్చర్లపై ఆధారపడి వుందని, పర్యావరణ హితంగా భవన నిర్మాణాలకు రూపకల్పన చేయాల్సిన అవశ్యకత వుందన్నారు. సంతోషమైన వాతావరణంలో భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు. నేడు ఎక్కడ చూసినా నగరాలు కాంక్రిట్‌ జంగిల్స్‌గా మారిపోతున్నాయని మానవాళి మనుగడకే అవి ప్రశ్నార్ధంగా నిలుస్తున్నాయన్నారు. దేశం నాది అనే భావన ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవాలన్నారు. భవన నిర్మాణాల ఆకృతుల రూపకల్పన సమయంలో వెలుతురుకు, గాలికి తగిన ప్రాధాన్యత కలిగించేలా పర్యావరణ సమతుల్యత పాటించేలా సూచనలు చేయాలన్నారు. ఈ రోజుల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశ హార్య్మాలు నిర్మిస్తున్నా తగిన భధ్రతా చర్యలు పాటించట్లేదన్నారు. ఆనంద, అభివృద్ధి నగరాల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయులుగా మనం గర్వించాలన్నారు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు వుందన్నారు. చరక, ఆర్యభట్ట వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఇక్కడ జన్మించారన్నారు. సర్వేజన సుఖినోభవంతు అనే భావన ప్రతి ఒక్కరిలో నిబిఢీకృతమై వుండాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత కలిగిన నగర నిర్మాణాలను చేపట్టాల్సిన, ప్రోత్సహించాల్సిన బాధ్యత మీపై వుందన్నారు. నేటి ప్రపంచీకరణలో భాగంగా స్వేచ్ఛాయుతతో కూడిన ప్రైవేటీకరణ దిశగా భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు. 21వ శతాబ్దంలో ఆర్కిటెక్చర్ల బాద్యత ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఏపి విభజన తరువాత ఎన్నో అత్యున్నత స్థాయి విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో నెలకొల్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అదే సమయంలో తన కల సాకారం అయిందన్నారు. జాతీయస్థాయిలో ప్రముఖ విద్యాసంస్తలైన ఐఐటి, ఎయిమ్స్‌ వంటి ఎన్నో ఉన్నతమైన విద్యాసంస్థలను, ఏపిలో ప్రారంభించడం, నిర్మాణాలు జరగడం జరుగుతోందన్నారు. విద్యార్ధి నాయకుడిగా విజయవాడతో తనకు విడదీయరాని అనుబంధం వుందని గత రోజులను నెమరువేసుకున్నారు. స్కూల్‌ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ జాతీయస్థాయి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం విజయవాడలో నిర్వహించడం ఇదే మొదటిసారని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందన్నారు. నేటి యువ విద్యార్ధులు, బ్యూటీ మరియు డ్యూటీ అనే ఒక సమాంతర వ్యవస్థగా వారి విధి నిర్వహణలో పనితనాన్ని చూపాల్సిన అవశ్యకత వుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వలస వస్తున్నారని తాను కూడా గ్రామీణాభివృద్ధి శాఖ నుండి పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా బాధ్యతలను నిర్వహించానంటూ ఛలోక్తులు విసిరారు. ఏపిలో 2008లో ప్రారంభించిన ఈ స్పా సంస్థకు 2014లో భవన నిర్మాణాలకు తాను శంకుస్థాపన చేశానని, ఈ రోజు ప్రారంభించడం ఎంతో ఆనందంగా వుందన్నారు.