ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో 4.48% వృద్ధి

b2
car sales

ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో 4.48% వృద్ధి

న్యూఢిల్లీ, నవంబరు 10: దేశీయ ప్యాసింజర్‌ కార్ల విక్రయాల పరంగా అక్టోబరునెలలో 4.48శాతం వృద్ధిని సాధించినట్లు సియామ్‌ గణాంకాలు చెపుతున్నాయి. గత ఏడాది 2,68,630 వాహనాల నుంచి 2,80,677 వాహనాలకు పెరిగినట్లు తేలిం ది. దేశీయ కార్ల విక్రయాలపరంగా స్వల్పంగా 1,95,036 యూనిట్లకు చేరాయి. గతఏడాది 1,94,158 యూనిట్లు పెరిగా యి. మోటారుసైకిల్‌ విక్రయాలపరంగాచూస్తే 7.37శాతం పెరి గాయి. 11,44,516 యూనిట ్లవరకూ పెరిగినట్లు అంచనా. గత ఏడాది అక్టోబరులో 10,65,925 యూనిట్లు మాత్రమే పెరిగాయి. అక్టోబరులో మొత్తం ద్విచక్రవాహనాలు విక్రయాలు 8.72శాతం పెరిగి 18,00,672 యూనిట్లకు చేరాయి. ఏడాది క్రితంచూస్తే 16,56,304 యూనిట్లకు చేరాయి. వాణిజ్యవాహనాల పరంగా 11.9శాతం పెరిగి 65,569 యూనిట్లకు చేరాయని సియామ్‌ వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో వాహన విక్రయాలను పరిశీలిస్తే 8.14శాతం పెరిగి 22,01,571యూనిట్లకు పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో చూస్తే 20,35,905 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగినట్లు సియామ్‌ వెల్లడించింది.