ప్యాచ్‌వర్క్‌ చీరల అందం

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌
( ప్రతి శుక్రవారం)

FASHION-5
FASHION-5

This slideshow requires JavaScript.

ప్యాచ్‌వర్క్‌ చీరల అందం

హుందాగా ఉండే బెనారస్‌, స్టైలిష్‌ నెట్టెడ్‌, ఒంటికి హత్తుకునే సిల్క్‌, జలతారులాంటి జార్జెట్‌, దేని ప్రత్యేకత దానిదే. ఇలాంటి రెండు మూడు ఫ్యాబ్రిక్‌లు కలిసి ఒక చీరగా రూపుదిద్దుకుంటే అదే ప్యాచ్‌వర్క్‌ శారీ. కొంగు, అంచు, కుచ్చిళ్ల భాగాలు ఇలా ఏదో ఒకచోట చీరకు భిన్నమైన ఫ్యాబ్రిక్‌ వాడటం దీనిలో ప్రత్యేకత. సంక్రాంతి పండుగలో భోగిపళ్లు, బొమ్మల కొలువ్ఞలు, గాలిపటాల రెపరెపలు, కోడిపందాల సందళ్లు ఉన్నట్టే ప్యాచ్‌వర్క్‌లోనూ రకరకాల సొబగులు ఉంటాయి. పండుగంటే పట్టుచీరే అనే ఆలోచనను కాస్త పక్కనపెట్టి ఈసారి ఈ ప్యాచ్‌ డిజైన్‌ను ఎంచుకోండి. రంగురంగుల సీతాకోకలై పండుగ లోగిళ్లలో వాలిపోండి.