ప్యాకప్‌ అవ్వగానే రకూల్‌నే…

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్ర జయజానకి నాయక. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంటర్వ్యూ

RAKUL PREET SINGH-2

 ప్యాకప్‌ అవ్వగానే రకూల్‌నే…

జయజానకి నాయక గురించి చెప్పండి?

జయజానకి నాయక అందరికీ తెలిసినట్టు బోయపాటి సార్‌ స్కూల్‌ నుంచి డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌తో వచ్చిన సినిమా. బోయపాటి సార్‌ సిగ్నేచర్‌ యాక్షన్‌ ఉంటుంది. ఆయన సిగ్నేచర్‌ ఉంటుంది. ఇందులో మెయిన్‌ యాస్పెక్ట్‌ ఏంటంటే లవ్‌స్టోరీ. ఒక ఇన్సిడెంట్‌ వల్ల ఆమె మొత్తం లైఫ్‌ మారిపోతుంది. ఆ ఇన్సిడెంట్‌ ఏంటి? ఎక్కడ? అనేది ఈ సినిమాలో చాలా కీలకం.

నెగటివ్‌ టచ్‌ ఉంటుందా?
నెగటివ్‌ ఉండదండీ కానీ లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ వల్ల ఆమె ఎందుకలా శాడ్‌గా మారింది? అనేది ఆసక్తికరం. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో మోస్ట్‌ ఎమోషనల్‌ పాత్ర ఇదే. ఆ సమయంలో మా అమ్మ పోన్‌ చేసిన సరే నేను మాట్లాడకపోయేదాన్ని. బీయింగ్‌లో ఫీలింగ్‌లో దాని కోసం చాలా ఎనర్జీ కావాల్సివచ్చేది.

డిప్రెషన్‌ అనేది నేచురల్‌గా జరుగుతుంది కదా…దాన్ని సినిమాలో ఎలా ప్రెజెంట్‌ చేశారు?
అంటే డిప్రెషన్‌ అనేది డిస్‌ కనెక్ట్‌ యువర్‌సెల్ప్‌ అన్నమాట. షూటింగ్‌ సమయంలో నార్మల్‌ మూడ్‌లో ఉంటే ఫోన్లు చూసుకోవచ్చు. చాట్‌ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనం డిప్రెషన్‌ మూడ్‌లో ఉంటే మాత్రం అవన్నీ చాలా కష్టం.

అప్పుడు మీ మైండ్‌ స్టేట్‌ ఎలా ఉండేది?
చాలా బ్లాంక్‌గా ఉండేదాన్ని. చాలా మంది లైఫ్‌లో జరిగిన ఏదో ప్రమాదాన్నో, చెడునో ఊహించుకుని ఉంటారు. కానీ భగవంతుడు దయవల్ల నా లైఫ్‌లో ఎప్పుడూ ఏ బ్యాడూ జరగలేదు. బోయపాటి సార్‌ నా దగ్గరకు వచ్చి షాట్‌ అయిపోయింది. నువ్వు నవ్వొచ్చు కాస్త అని అనేవారు. అప్పుడు నవ్వేదాన్ని.

సో దీన్నుంచి ఎలా బయటపడ్డారు?
ప్యాకప్‌ తర్వాత నేను నార్మల్‌ లైఫ్‌ని లీడ్‌ చేసేదాన్ని. ఎందుకంటే చాలా మందికి కేరక్టర్ల ఇంపాక్ట్‌ ఉంటుంది. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తామని అంటారు. కానీ నేను అలా కాదు. ప్యాకప్‌ కాగానే నేను రకుల్‌నే. జానకికాదు. నేను మామూలుగా సినిమాలకు వెళ్లేదాన్ని.

డిప్రెషన్‌లో ఉన్న సీన్లను ఎన్ని రోజులు షూట్‌ చేశారు?
రేపల్లె ఎపిసోడ్‌, బ్యాంకాక్‌ ఎపిసోడ్‌ అలా చేసిందే. దాదాపుగా 25రోజులు డిప్రెషన్‌లోఉన్నట్టు ఉన్నానంతే.

గ్లిజరిన్‌ వాడేవారా?
దేవుడి దయవల్ల గ్లిజరిన్‌ లేకుండా ఏడవాల్సిన అవసరం నాకు రాలేదు. కాకపోతే గ్లిజరిన్‌ వాడి వాడి సాయంత్రానికి నా కళ్ళు రెండూ బాగా ఉబ్బేవి. నేనొకసారి బోయపాటి గారితోకూడా అన్నాను. సార్‌ ఈ షెడ్యూల్‌ అయ్యేసరికి నా కళ్ల కింత చారలు వచ్చేటట్టున్నాయి. రోజూ కళ్ళువాయడం, నేను ఐస్‌ ప్యాక్‌ పెట్టడం అవుతోంది అని.

సినిమాలను చూసి ఏడ్చే అలవాటుందా మీకు?
సినిమా మొత్తం చూసి నేనెప్పుడూ ఏవడలేదు. ఎప్పుడో ఒకటీ, అరా సీన్లకు కన్నీళ్లు పెట్టుకునేదాన్ని.

ఈ సినిమా కూడా ట్రాజిక్‌ ఎండింగ్‌ ఉంటుందా?
ఎండింగ్‌ ఇప్పుడు చెప్పేస్తే జనాలు ఎందుకు చూస్తారండీ బోయపాటి ఇలాంటి టైటిల్‌ పెడతారని అనుకున్నారా? సినిమాకు ఏం కావాలో, ఎలా ఉంటే బావ్ఞంటుందో ఇంకేం చేయాలో బోయపాటి గారికి బాగా తెలుసు. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ప్లస్‌లూ, మైనస్‌లు ఆయనకు తెలుసు. ఈ సినిమా కంప్లీట్‌గా జానకి సినిమా. ఈ సినిమాకు హర్డ్‌ టైటిల్‌ పెట్టాలని ఆయన అనుకోలేదు. అందుకే ఆయన ఈ టైటిల్‌ పెట్టారు.

బోయపాటికి మీస్ట్రెంగ్త్‌లు, వీక్‌నెస్‌లు తెలుసన్నారుగా…వీకు ఆయన ఎప్పుడైనా వాటి గురించి చెప్పారా?
చెప్పారు. నేను కరెక్ట్‌ చేసుకన్నా. వాటి గురించి ఇప్పుడు చెప్పలేను.

మీ ప్రకారం మీకున్న ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?

నా బలాలు, బలహీనతలు ప్రజలే చెప్పాలి. మనం ప్రతిదీ పర్ఫెక్ట్‌గా చేస్తామనే అనుకుంటాం. కానీ అందులో ఎంత బలమో, ఏది బలహీనతో మాత్రం ప్రజలే చెప్పాలి.

సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్‌ హ్యాంగ్‌వర్‌లో ఉంటారా?
అబ్బే లేదండీ…అదే ఫీలింగ్‌లో ఉండే అమ్మాయిని కాదు నేను. ఎందుకంటే క్యారెక్టర్‌ మన పర్సనల్‌ లైఫ్‌ని ఓవర్‌టేక్‌ చేయకూడదు. ఒకవేళ చేసిందంటే సైకోలా మారుతారు. ఎందుకంటే ఇన్నేసి పాత్రలు చేసిన తర్వాత, ఆ పాత్రల ప్రభావం మన మీద ఉంటే డిప్రెస్‌ అవుతాం.

ఈ సినిమాలో మీ హార్ట్‌ని టచ్‌ చేసిన సన్నివేశాలున్నాయా?
ఉన్నాయండీ. నేను సినిమాను ఆడియన్‌గా చూసినప్పుడు వాటిని ఫీలవుతాను. అంతేగానీ సీన్‌ చేసేటప్పుడు నేను హార్ట్‌ని టచ చేస్తుందని అనుకోను. ఎందుకంటే నేను అక్కడ రకుల్‌ని కాదు…జానకిని మాత్రమే.

భ్రమరాంబకి, జానకికి పోలికలుంటాయా?
లేదండీ…చాలా తేడాలున్నాచా?

ట్రైలర్‌లో జానకి మార్చిందని అంటారు.మీరు మార్చారా?
అది సినిమా చూసి తెలుసుకోవాలి. వదులుకోవాల్సిన ప్రతిసారీ…ప్రేమనే వదులుకోవాలా…అనే డైలాగ్‌ కూడా ఉన్నట్టుంది? అది నా ఫెవరేట్‌ డైలాగ్‌ అండీ…