పౌష్టికాహార లోపం నివారణకు ముమ్మర యత్నం

Children

పౌష్టికాహార లోపం నివారణకు ముమ్మర యత్నం

ప్రపంచం మొత్తం మీద పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పసివారిలో ఎక్కువ శాతం మంది భారతదేశంలోనే ఉన్నారని లెక్కకు రావడం శోచనీ యం. తరతరాలుగా పౌష్టికాహార లోపం వల్లనే పిల్లలు తక్కువ బరువ్ఞతో పుడుతున్నారు. వేగంగా వ్యాధులకు బలవ్ఞతున్నారు. దేశంలో ప్రతిముగ్గురిలో ఒక పిల్లవాడు మానసిక, శారీరక ఎదుగు దల సరిగ్గాలేక గిడసబారిపోతున్నాడని నివేదికలు చెబుతున్నాయి. 35.7శాతంమంది తక్కువబరువ్ఞతో సతమతమవ్ఞతుండగా 38.4 శాతం మంది గిడసబారిపోయారు.

21 శాతం మంది పిల్లలు తీవ్ర మైన పౌష్టికాహార కొరతను ఎదుర్కొంటున్నారు. బాలికల్లో పౌష్టికా హార లోపంతోపాటు రక్తహీనత అధికంగా ఉంటోంది. దీనికితోడు బాల్యవివాహాల వల్ల చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం మరింత సమస్యకు దారితీస్తోంది. 15-49 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళ ల్లో సగం కంటే ఎక్కువ మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని పరిశీలించి జాతీయ అభివృద్ధి అజెండాలో పౌష్టికా హారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక మిషన్‌ ఉండాలని, జిల్లాలవారీగా కలెక్టర్‌ నేతృత్వంలో ఈ మిషన్‌ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.

ఇందులో స్థానిక ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భాగస్వాములను చేయాలని ఎన్జీవోలకు స్థానం కల్పించాలని సూచించింది. ఇదేవిధంగా ప్రతిమం డలంలో మండలాధ్యక్షుడి నేతృత్వంలో ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు చేసి స్థానిక వైద్యఆరోగ్య అధికారి, ఎంఈడి, ఐసిడిఎన్‌ అధికారు లు,తాగునీరు,పారిశుద్ధ్య అధికారులకు స్థానం కల్పించాలని సూచిం చింది. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఆరోగ్య, పారిశుద్ధ్య పౌష్టికాహార కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. గ్రామం, నివాస సముదా యాల స్థాయిలో మాతాశిశు ఆరోగ్యం, పౌష్టికాహార బాధ్యతలను పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాలకుఅప్పగించాలని, ఆశా, అంగన్‌వాడీ, ఎఎస్‌ఎంలకు ఉమ్మడిగా శిక్షణ ఇచ్చి పౌష్టికాహారం గురించి అవగా హన కల్పించాలని సూచించింది.

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 25 శాతం నిధులు దీనికోసం వినియోగించుకోవడానికి రాష్ట్రాలకు వెసు లుబాటు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పౌష్టికాహార లోపంతో అలమటిస్తున్న 50 దేశాల్లో భారత్‌ ఒకటి. భారత జనాభాలో 15.2 శాతం అంటే దాదాపు 21 కోట్ల 50లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు స్పష్టమ యింది. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం జనం పౌష్టికాహార లోపంతో తల్లడిల్లుతున్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లేమిని, నిర్మూలించాలన్నదే ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యం. ప్రపంచం మొత్తం మీద వివిధ ప్రమాణాల బహుముఖ పేద వర్గా లకు చెందిన పిల్లల్లో 31 శాతం మనదేశంలోనే ఉన్నారు. అంటే 689 మిలియన్‌ పేద పిల్లల జనాభాలో 31 శాతం ఇక్కడే ఉన్నా రని ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ అధిపత్యంలోని పేదరిక నిర్మూలనకు సంబంధించిన ప్రాజెక్టు ఆక్స్‌ఫర్డ్‌ పోవెర్టీ.

హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనేసియేటివ్‌ (ఒపిహెచ్‌) రూపొందించిన నివేదిక వెల్లడించింది. నైజీరియాలో 8శాతం,ఇథోపియాలో 7శాతం,పాకిస్థాన్‌లో 6 శాతం పేద పిల్లలున్నారని గ్లోబల్‌ మల్టీ డైమెన్షనర్‌ పావర్టీ ఇండెక్సు (ఎం పిఐ) 2017 నిర్వహించిన సర్వేలో తేలింది.103 దేశాల్లో సాగిన సర్వే ఆధారంగా ఈ నివేదిక తయారైంది. ‘బహుముఖ పేదరికం అంటే పేదరికాన్ని నిరూపించే 10 సూచికలను తీసుకుంటే వాటిలో రెండింట మూడోవంతు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణస్థాయి ఈ మూడు అంశాలు కలిపి పరిశీలించవలసి వస్తోంది.

ఇటువంటి బహుముఖ పేదరిక పిల్లల్లో ప్రపంచం మొత్తం మీద 103 దేశాల్లో భారతదేశం 37వస్థానం వహిస్తోంది. భారతదేశంలోని 217 మిలియన్‌ పిల్లల్లో 49.9 శాతం మంది బహుముఖ పేదరికపు పిల్లలే. మొత్తం మీద భారతదేశంలో బహుముఖ పేదరికం చాలా ఎక్కువని చెప్పవచ్చు. 528 మిలియన్‌ మంది పేదరికంతో మగ్గుతు న్నారు. 103 దేశాల్లోని పిల్లల్లో దాదాపు 50 శాతం మంది బహు ముఖ పేదలే అని స్పష్టమవ్ఞతోంది. 103 దేశాలకు చెందిన 1.46 బిలియన్‌ (145 కోట్ల) బహుముఖ పేదల్లో 48 శాతం పిల్లలు ఉన్నారు. మొత్తం మీద బహుముఖ పేదరికంలో 689 మిలియన్‌ (68.9 కోట్లు) పిల్లలు ఉన్నారని నివేదిక చెబుతోంది. అధ్యయనం ప్రకారం బహుముఖ పేదరిక పిల్లలు 87 శాతం మంది దక్షిణాసి యాలో (44 శాతం) ఉన్నారు. సబ్‌సహరాన్‌ ఆఫ్రికాలో 43 శాతం ఉన్నారు.

ఇథోపియా, నైజీరియా, దక్షిణ సూడాన్‌ దేశాల్లో 90 శాతం మంది బహుముఖ పేదపిల్లలే. అని నివేదిక వెల్లడించింది. కటిక పేదరికంతో అల్లాడుతున్నవారి సంఖ్యలో బహుముఖ పేదరి కానికి సంబంధించిన 10 తరగతుల్లో సబ్‌సహరాన్‌ అగ్రస్థానంలో ఉంది. అక్కడ 58 శాతం బహుముఖ పేదరిక పిల్లలే. సబ్‌సహ రాన్‌ తరువాత అరబ్‌ దేశాల్లో 53 శాతం, దక్షిణాఫ్రికా మూడో స్థానంలో 49శాతం పిల్లలు బహుముఖ పేదరికంతోమగ్గుతున్నారు. అంతర్జాతీయ సమాజానికి ఇదొక హెచ్చరిక, ప్రపంచదేశాల అభి వృద్ధే లక్ష్యంగా అంతర్జాతీయ సమాజం పేదరిక నిర్మూలనే మొదటి అంశంగా బాధ్యత వహించక తప్పదు.

-పి.వి.ఆర్‌.మూర్తి