పోషకాహారం అవసరం

Healty Food
Healty Food

పోషకాహారం అవసరం

మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసర మైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పని చేస్తుంది. ఆహారం మన శరీరా నికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది. అవి – శరీర నిర్మాణా నికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలను క్రమబద్ధీకరిం చడానికి. శరీర నిర్మాణానికి మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది.

పుట్టినప్పుడు 2.7 కిలోలనుంచి 3.2 కిలోల బరువు ఉండే పాపాయి పెరిగి పెద్దయ్యే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. ఈ ఎదిగిన బరువంతా అతడు తను పుట్టిన దగ్గరనుంచి తీసుకున్న ఆహారం ద్వారానే లభిస్తుంది. అంటే ఆహారం అతి ముఖ్య క్రియ శరీర నిర్మాణానికి సహకరించడం. ప్రతిరోజూ ఆహారాన్ని సరైన పరిమాణంలో తీసుకుంటే అది శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణా లను నిర్మిస్తూ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శక్తిని చేకూర్చడానికి: ఆహారం మన శరీరానికి అందజేసే రెండవ ఉపకరం – మన శరీరం చేసే సంకల్పిత, అసం కల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించడం. సంకల్పిత చర్యలు : దీనినే వలంటరీ యాక్టి విటీస్‌ అంటాము. ఇవి మనం ప్రయత్నపూర్వకంగా చేసే పనులు. ఉదాహరణకు ఇంటి పని నుంచి ఆఫీసు పని వరకూ నిత్య జీవితంలో మనం తెలిసి చేసే పనులు. వీటిని మనం ఇన్‌వాలంటరీ యాక్టివిటీస్‌ అంటాము. అంటే మన ప్రయత్నం, ప్రమేయం లేకుండానే మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు. ఉదాహరణకు గుండె కొట్టుకోవడం, జీర్ణం కావడం, శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడం మొదలైనవి. మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే, జరగాల్సిన కార్యక్రమాల క్రమబద్ధీకరణ ఈ కోవలోకి వచ్చే చర్యలు. ఉదాహరణకు – గుండె కొట్టుకోవడం, కండరాల సంకోచ వ్యాకోచాలు, శరీరంలో నీటి సమతు ల్యాన్ని కాపాడటం, రక్తం గడ్డ కట్టడం, శరీరంనుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం మొదలైనవి. శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాల న్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిపడా లభించా లన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతులాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

మన మనుగడకు ఉపకరించే పోషకాలు – కార్బొహై డ్రేట్లు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్‌లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థం. సమతులాహారమంటే?: మన శరీరం పని చేయడానికి ఆహారం, నీరు అతి ముఖ్యమైన పోషకావసరాలు. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకరమైన బాక్టీరియాతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతర శరీర ధర్మాల నిర్వహణకు ఆహారం ద్వారా లభించే రసాయనాల అవసరం ఎంతో ఉంది. కొన్ని ఆహారాల్లో ఎక్కువగానూ, మరికొన్నింటిలో తక్కువగానూ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. మనం ఎంత తింటున్నామనేది మాత్రమే కాదు, ఏం తింటున్నామనేది కూడా ముఖ్యమే. శరీరారోగ్యానికి అవసరమయ్యే అంశాలను తెలిపే ఆహార నియమావళిని అమెరికా శాస్త్రవే త్తలు ఫుడ్‌ గైడ్‌ పిరమిడ్‌గా రూపొందించారు. దాని ప్రకారం అన్నం, రొట్టె, బ్రెడ్‌ మొదలైనవి : వీటిని ఎక్కువగా వాడుకోవాలి. ఈ ఆహార పదార్థాల్లో ఫైబర్‌, బి విటమిన్‌లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండటమే కాకుండా కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు కూడా లభిస్తాయి. పళ్లు : వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ఎ, సి వంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. వీటిలో కూడా కొవ్వు తక్కువగానూ, ఎ, సి విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. ఫైబర్‌, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, జీడిపప్పులైతే సాధారణంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉం టాయి. ఐరన్‌, బి-విటమిన్‌, కొన్ని ఖనిజలలవణాలు కూడా ఎక్కు వగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. డైరీ ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్లు, విట మిన్లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి.