పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం

Eating
Eating

పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం

గర్భిణిగా ఉన్నప్పుడు ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి ఆకలి అధికంగానే ఉంటుంది. అయితే గర్భంలోని శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపదార్థాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాల ప్రభావం తల్లిమీదకంటే గర్భస్థ శిశువు మీదనే అధికంగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్టులు.

ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో కొన్ని వివరాలు చెబుతున్నారు. అవి… ్య సరిగా ఉడకని, సగం ఉడికిన మాంసాహారం మంచిదికాదు. ఇలాంటి ఆహారపదార్థంలో ఉండే క్రిములు తల్లిమీద కంటే కడుపులోని శిశువుమీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ్య చేపలు, రొయ్యలులాంటి జలచర ఆహారానికీ దూరంగా ఉండాలి.
సరిగా కడగని లేదా అసలు కడగని పండ్లు తినకూడదు. పచ్చికూరగాయలకూ దూరంగానే ఉండండి. లేకపోతే వీటిమీద ఉండే పురుగుల మందుల అవశేషాలు కడుపులోని లేతప్రాణం మీద విపరీత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

సరిగా కడగని, ఉడికించని ఆహార పదార్థాలమీద ఉండే పురుగుగుడ్లు ఇన్ఫెక్షన్లకు, రక్తలేమికి దారితీస్తాయి. ్య అలాగే సరిగా మూతపెట్టని, నిలువ ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఉత్తమం. పండ్లరసాలను కూడా వీలయినంత వరకు ఎప్పటికప్పుడు తాజాగా ఇంట్లో చేసుకుని తాగాలి. తయారుచేసిన తరువాత ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తాగడం ఉత్తమం

పండ్లు రసం తీసుకుని తాగడం కంటే పండుగానే తినడం వల్ల దాంట్లో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ ఇతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. ్య పాలుకానీ, జున్నుకానీ ఎక్కువసేపు మరి గించిన తరువాతే తీసుకోవాలి. సరిగా మరిగించని పాలు, జున్నుల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ్య తాగేనీటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వచ్చ మైన నీటిని తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.