పోషకాల సలాడ్స్‌

CARROT
CARROT

పోషకాల సలాడ్స్‌

కొంతమందికి అన్నం అంటే ఎక్కువ ఆసక్తి ఉండదు. వాళ్లకు తక్కువగా తినాలనిపిస్తుంది. కాని ఆకలిగానే ఉంటుంది. అలాగని ఏ పండ్లరసాలో, మజ్జిగో తీసుకున్నా ఆకలి తీరని పరిస్థితి. మరేమిటి పరిష్కారం అంటారా? కొన్ని రకాల కూరగాయలకు, మరికొన్ని రకాల పదార్థాలు కలిసి నోరూరించే సలాడ్లు అప్పటికప్పుడు చేసుకుని తింటే ఆకలి తీరుతుంది. కేలరీల సమస్య ఉండదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా…
శనగలతో…
కావలసినవి వంకాయ-ఒకటి ఉడికించిన శనగలు-రెండు టేబుల్‌స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ-ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున టమాట ముక్కలు-టేబుల్‌ స్పూన్‌చొప్పున ఆలివ్‌ నూనె-టేబుల్‌స్పూన్‌పచ్చిమిర్చి-ఒకటి కొత్తిమీర తరుగు-ఒక టేబుల్‌స్పూన్‌ ఉప్పు-తగినంత నిమ్మరసం-ఒక టేబుల్‌స్పూన్‌ కారం-చెంచా పచ్చిమిర్చి సాస్‌-కొద్దిగా

తయారుచేసే విధానం
వంకాయను ముందుగా పొయ్యిమీద పెట్టి కాల్చాలి. ఆ తరువాత పొట్టు తీసేసి ముక్కల్లా చేసుకోవాలి. ఓ గిన్నెలో ఆలివ్‌నూనె, నిమ్మరసం, ఉప్పు, సగం చొప్పున ఉల్లిపాయ, టమాట ముక్కలు, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. వీటిలో ఉడికించిన శనగలు, పచ్చిమిర్చి సాస్‌, వంకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. పైన సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కారం, మిగిలిన ఉల్లిపాయ, టమాట ముక్కలు వేస్తే సరిపోతుంది.

కాలీఫ్లవర్‌తో…
కావలసినవి కాలీఫ్లవర్‌ పువ్వులు-అరకప్పు ఉప్పు-తగినంత మిరియాలపొడి- చెంచా ఆలివ్‌నూనె-ఒక టేబుల్‌స్పూన్‌ చిల్లీసాస్‌-అరచెంచా ఎండబెట్టిన పుదీనా ఆకులపొడి-పావ్ఞ చెంచా తయారుచేసే విధానం కాలీఫ్లవర్‌ ముక్కలు మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి ఐదు నిమిషాలు కాగానే దింపేయాలి. నీళ్లు వంపేసి, కాలీఫ్లవర్‌ ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకుని ఉప్పు, మిరియాలపొడి, చిల్లీసాస్‌, ఎండబెట్టిన పుదీనా ఆకుల పొడివేసి బాగా కలపాలి. ఈ ముక్కలన్నింటిపై పడేలా ఆలివ్‌నూనె వేయాలి. ఈ సలాడ్‌ చాలా రుచిగా ఉంటుంది.

గ్రీన్‌సలాడ్‌…
కావలసినవి
కీరదోస ముక్కలు-అరకప్పు లెట్యూస్‌ లేదా క్యాబేజీ ఆకులు-రెండు టమాట, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు-పావుకప్పు చొప్పున ఆలివ్‌లు-ఐదారు తేనె-చెంచా పుదీనా ఆకులు-రెండు, మూడు నిమ్మరసం-చెంచా ఎండుమిర్చి గింజలు-అరచెంచా ఆలివ్‌ నూనె-ఒక టేబుల్‌స్పూన్‌ పనీర్‌ ముక్కలు-ఐదు లేక ఆరు ఎండబెట్టిన పుదీనా ఆకులపొడి-చెంచా ఉప్పు-తగినంత మిరియాలపొడి-కొద్దిగా

తయారుచేసే విధానం
కూరగాయ ముక్కలన్నింటినీ వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి. ఆ తరువాత మరో గిన్నెలో ఆలివ్‌నూనె, పుదీనా ఆకులపొడి తేనె నిమ్మరసం ఎండుమిర్చి గింజలు ఉప్పు, మిరియాల పొడివేసు కుని బాగా కలిపితే సలాడ్‌ డ్రెసింగ్‌ తయారవ్ఞ తుంది. ఇప్పుడు కూరగాయ ముక్కలు, ఆలివ్‌లు, పుదీనా ఆకుల్ని తీసుకుని లెట్యూస్‌ లేదా క్యాబేజీ ఆకుమీద సర్ది, పనీర్‌ ముక్కలు కూడా వేసేయాలి. దీన్ని సలాడ్‌ డ్రెసింగ్‌తో కలిపి వడ్డించాలి.

కేరట్‌తో…
కావలసినవి
కేరట్లు-రెండు, కొత్తిమీర-కట్ట ఆలివ్‌నూనె-రెండు చెంచాలు నిమ్మరసం-చెంచా ఉప్పు, మిరియాలపొడి-తగినంత వేయించిన పిస్తా పలుకులు-ఒక టేబుల్‌స్పూన్‌ కమలాఫలం గుజ్జు-రెండు టేబుల్‌స్పూన్లు అరెగానో-అరచెంచా

తయారుచేసే విధానం
కేరట్లను సన్నగా, పొడుగ్గా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో ఆలివ్‌నూనె, మిరియాలపొడి, నిమ్మ రసం, ఉప్పు, అరెగానో తీసుకుని బాగా కలపాలి. అందులో కేరట్‌ ముక్కలు కూడా వేయాలి. ఈ సలాడ్‌ను పళ్లెంలోకి తీసుకుని పైన కమలాఫలం గుజ్జూ కొత్తిమీర తరుగు, పిస్తా పలుకులూ అలంకరిస్తే సరిపోతుంది. నోరూరించే కేరట్‌ సలాడ్‌ సిద్ధం.