‘పోల‌వ‌రం’ లెక్క‌ల‌న్నీ అన్ లైన్‌లో ఉంచండిః చంద్ర‌బాబు

Chandrababunaidu
Chandrababunaidu

అమ‌రావతిః ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలన్నింటినీ ఆన్ లైన్లో ఉంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు ఆయన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు లెక్కలను ప్రస్తావించారు. ఇప్పటి వరకు అయిన వ్యయం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులను ఆన్ లైన్ లో పొందుపరచాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను కూడా పెట్టాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివ‌రాలు ఆన్ లైన్లో ఉండాలని ఆదేశించారు.