పోల‌వ‌రం ప‌నులు స‌గం పూర్తిః దేవినేని ఉమ‌

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

విజ‌య‌వాడః సీఎం చంద్రబాబు పోలవరం పనులను పరిగెత్తిస్తున్నారని మంత్రి దేవినేని ఉమా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ 50 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామని వెల్లడించారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసినట్టే గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేస్తామని దేవినేని ఉమా అన్నారు