పోల‌వ‌రం ప్రాజెక్ట్ దేశానికే త‌ల‌మానికంః గ‌డ్క‌రీ

Nithin gadkari
Nithin gadkari

ప‌శ్చిమ‌గోదావ‌రిః పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు… దేశానికే త‌ల‌మానిక‌మైన ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధ‌వారం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి సమస్యల్ని పరిష్కరించాలని సూచించానన్నారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తామన్నారు. భూసేకరణ, పరిహారం కోసం నిధులు చెల్లించాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతి కావాలన్నారు. పోలవరం భూసేకరణ ఖర్చు దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు.