పోల‌వ‌రం ప్రాజెక్టును స‌కాలంలో పూర్తి చేస్తాంః గ‌డ్క‌రీ

central minister Nitin gadkari
central minister Nitin gadkari

ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రఘులు గురువారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. ఈ సంద‌ర్భంగా నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ పోల‌వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని, అందుకే జలవనరుల మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పోలవరాన్ని సందర్శించానన్నారు. పోలవరంపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని, పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.