పోలీసు స్టేషన్‌ సెట్‌లో ‘యు టర్న్‌’

U TURN11
U TURN

పోలీసు స్టేషన్‌ సెట్‌లో ‘యు టర్న్‌’

వరుసగా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం యు టర్న్‌ అనే సినిమాలో నటిస్తోంది.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈసినిమా తెరకెక్కుతోంది. సమంత ఈసినిమాలో జర్నలిస్టు పాత్రలో కన్పించనున్నారు..తాజాగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈసినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఒక పోలీసుస్టేషన్‌ సెట్‌లో జరుగుతోంది.. ఆది పినశెట్టి , రాహుల్‌ రవీంద్రన్‌ ఈసినిమాలో నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు నితేక్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సిల్వర్‌స్క్రీన్‌ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి, ఈసినిమాను నిర్మిస్తున్నారు.. త్వరలో సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.