పోలీసు ఎదురుకాల్పుల్లో అంత‌రాష్ర్ట దొంగ భీంసింగ్ మృతి!

gun
gun

క‌ర్నూలుః అంతరాష్ట్ర దొంగ భీంసింగ్ పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. 144 కేసుల్లో నిందితుడైన భీంసింగ్ పట్టుకునేందుకు కర్నూలు జిల్లా పోలీసుల రాజస్థాన్‌లోని జాలోర్ వెళ్లారు. పోలీసులను చూసిన భీసింగ్ తమపై కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో భీంసింగ్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. డోన్ మండలం ఓబులాపురంమిట్ట వద్ద సెప్టెంబర్‌లో భీంసింగ్ రూ.5.5 కోట్ల అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.