పోలీసుస్టేషన్‌ చేరుకున్న చంద్రముఖి

chandramukhi
chandramukhi

హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి 11 గంటలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కే చేరుకొన్న చంద్రముఖి.. తన ను కొందరు చెన్నైకి తీసుకెళ్లి నట్టు చెప్పింది. అక్కడినుంచి తప్పించుకొని తిరుపతి మీదుగా వచ్చానని.. ప్రస్తుతం షాక్‌లో ఉన్నందున గురువారం పూర్తివివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నది. అంతకుముందు చంద్రముఖి కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆమె తల్లి.. బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖిని కోర్టులో హాజ రుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని దాఖలుచేసిన పిటిషన్‌ను విచా రించిన హైకోర్టు.. గురువారం ఉదయం 10.15 గంటలలోగా కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది.