పోలీసుల లాఠీఛార్జిలో ఎమ్మెల్యేకు గాయాలు

tension
tension

హైదరాబాద్‌: నగరంలోని జుమ్మెరాత్‌ బజార్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాణి అవంతి బాయ్‌ లోథ్‌ పునర్మించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. ఐతే ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. మద్దతుగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అనుమతి లేకుండా విగ్రహాన్ని పునర్మించవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. రాజాసింగ్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై డిజిపికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/