పోలీసుల దిగ్బంధనంలో వేమవరం

Vemavaram
Vemavaram

పోలీసుల దిగ్బంధనంలో వేమవరం

ఒంగోలు: ప్రకాశంజిల్లా వేమవరంలో పరస్పర దాడుల నేపథ్యంలోపరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం విదితమే.దీంతో శనివారం గ్రామంలోని బయటివ్యక్తులను ఎవ్వరినీ అనుమతించటం లేదు.. పాతకక్షల కారణంగా ఎమ్మెల్సీ కరణం బలరామ్‌ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గొట్టిపాటి వర్గీయులు హత్యచేసిన నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.. పోలీసులు గ్రామాన్ని దిగ్బంధనం చేశారు.. నిన్నజరిగిన జంట హత్యల కేసుకు సంబందించి నలుగురిని అదుపులోకి తీసుకన్నారు.. నిన్నటి ఘటనలో క్షతగాత్రులకు చిలకలూరిపేట ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వైద్యశాలలో క్షతగాత్రులను మంత్రి ప్రత్తిపాటి పరామర్శించారు..