పోలీసులు అదుపులోకి దళ కమాండర్‌?

mavoists copy
mavoists

మహబూబాబాద్‌: జిల్లా ఆవిర్భావం నుండి సీపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాలపై నిఘాను తీవ్రం చేసిన పలువురిని అరెస్టు చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం తాజాగా పెద్ద చంద్రన్న వర్గానికి చెందిన దళ కమాండర్‌ నెల్లుట్ల ఉపేందర్‌ అలియాస్‌ ప్రసాద్‌ను శనివారం అదుపులోకి తీసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాదాపు రెండు దశాబ్దలుగా దళ కమాండర్‌గా పరిచేసిన ప్రసాద్‌ను ఏడేళ్లక్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. రిమాండ్‌పై జైలుకెళ్లిన ఆయన బెయిల్‌పై బయటకి వచ్చాక లీగల్‌ ఆర్గనైజర్‌గా పనిచేస్తూ గత సంవత్సరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. గూడూరు దళ కమాండర్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ అనారోగ్యానికి గురై వైద్యం కోసం నెల్లికుదురు మండలం మీదుగా ఖమ్మం వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.