పోలీసులను నమ్మని వ్యక్తి, మరి ఎవరిని నమ్ముతాడు?

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ విషయంలో ఆపరేషన్‌ గరుడలో చెప్పినట్లే జరిగిందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్‌ బాద్యతారాహిత్యంగా , దుర్మార్గంగా మాట్లాడారని..రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ వ్యవస్థను కించపరిచే విధంగా జగన్‌ వ్యాఖ్యలున్నాయని..పోలీసులను నమ్మని వ్యక్తి మరి ఎవరిని నమ్ముతారని ప్రశ్నించారు. కోడి కత్తుల వ్యవహారంలో సిబిఐ విచారణ కోరారని..రేపు ఇంటర్‌ పోల్‌ కూడా అడుగుతారేమోనని వ్యాఖ్యానించారు.