పోలీసులకు లొంగిపోయిన గాలి జనార్ధన్‌ రెడ్డి

BREAKING NEWS
BREAKING NEWS

బెంగుళూరు: మైనింగ్‌ కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్ధనరెడ్డి శనివారం మధ్యాహ్నం 3.55 గంటలకు బెంగుళూరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆంబిడెంట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు ఫరీద్‌ నుంచి జనార్ధన్‌ రెడ్డి 57 కేజీల బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.