పోలవరానికి పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తాం

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

అమరావతి :కేంద్రమంత్రి గడ్కారీకి మంత్రి దేవినేని ఉమ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధుల్లో రూ. 1400 కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఏపికి జీవనాడి అని చెప్పారు. ప్రాజెక్టు ఖర్చులు పెరిగినందున నిర్మాణ అంచనాలను సవరించాలని, దానికి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని లేఖ ద్వారా తెలిపారు.