పోలవరం వద్ద వరద ఉధృతి

పశ్చిమగోదావరి: ఎగువన కురుస్తోన్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. కొత్తూరు కాజ్వే పైకి కూడా వరద నీరు చేరుకుంది. దీంతో పోలవరం నుంచి 17గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పోలవరం ప్రాజెక్టు కడెమ్మ వంతెనకు నీరు చేరుకుంటోంది. గోదావరికి అడ్డుగా వేసిన నెక్లెస్ బండ్ మట్టి జారిపోవడంతో, పాత పోలవరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. గిరిజన గ్రామాలకు నిత్యావసర వస్తువుల కొరతను రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్డీవో మోహన్ కుమార్ తెలిపారు.