పోల’వరం’ లక్షకోట్లు పైనే!

AP CM at Polavaram  (File)
AP CM at Polavaram (File)

పోల’వరం’ లక్షకోట్లు పైనే!

ఆకాశాన్నంటుతున్న అంచనాలు
సప్తపదులు పూర్తయినా సాగుతూనే ఉన్న ప్రాజెక్టు
కేంద్రం, రాZం మధ్య దోబూచులాట
రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట
ఫలితాలు అందక రైతులు విలవిల
1941లో ప్రతిపాదన – 1942-44ల మధ్య ప్రాథమిక దర్యాప్తు
2005-06 నాటి అంచనావ్యయం రూ.10,151కోట్లు
అసెంబ్లీ సమావేశాల్లోనూ వాడీవేడి చర్చ
రూ.56వేల కోట్లు ఖర్చు అవుతుందంటున్న ప్రభుత్వం

పోలవరం… నిజంగానే ఇది పూర్తయితే వరం కన్నా ఎక్కువే. కారణం లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మంది దాహార్తి తీరుస్తుంది. వేలాదిమందికి ఉపాది దొరుకు తుంది. జలరవాణా మెరుగుపడుతుంది. అందుకే రాష్ట్రంలో ఇదే అంశం వాడీవేడిగా సాగుతోంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ శాసనసభలో దీనిపైనే టిడిపి, బిజేపిల మధ్య గరంగరం చర్చ జరిగింది. ఈ సంధర్భంగా కేంద్రంపై రాష్ట్ర సర్కారు, రాష్ట్ర సర్కారు తీరుపై బీజేపి సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే దీనికి రూ.56వేల కోట్లు ఖర్చవు తాయని తెలిపారు.

ఏది ఏమయినా ఇది పూర్తయితే అంతా మంచేఅయినా అల్లుడి నోట్లో శని అన్నచందంగా తయారైంది పోలవరంపరిస్థితి. దీని క్రెడిట్‌ తమకు దక్కా లంటే తమకే దక్కాలన్న రాజకీయ స్వార్థం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. విపక్షాలన్నీ కూడా ప్రాజెక్టు పూర్తికావాలంటూనే కోర్టులో పిటిషన్లు వేస్తున్నాయి. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి తాజాగా సుప్రీంలో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక కేంద్రం జాతీయ ప్రాజెక్టు కాబట్టి తమ నిఘాలోనే ఉండాలని వాదిస్తూ తాత్సారం చేస్తోంది. పనులు తాము చేపట్టామని, అంతా తామే చూసుకుంటామని రాష్ట్రం అంటోంది.

కాంట్రాక్టర్‌ విషయంలోనూ మిత్రులే అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు రాజుకున్నాయి. నిధులు ఇవ్వడం లేదని ఏపి, ఇచ్చిన నిధులకు లెక్కలు చూపిన వెంటనే నిధులిస్తామని కేంద్రం వాదించుకుంటున్నాయి. రాష్ట్రం లెక్కలు ఇవ్వకుండా ఉండడం, కేంద్రం నిధులు విడుదల చేయకుండా నిలిపివేస్తుండడంతో పోలవరం ముందుకు సాగడం లేదు. రాజకీయ స్వార్థం, కలిసిరాని పరిస్థితులు.. కారణం ఏదయినా ఈ ప్రాజెక్టు పనులకు మాత్రం అంతరాయాలు తప్పడం లేదు. ప్రాజెక్టు మొదలుపెట్టి ఏడు దశాబ్దాలు పూర్తయినా పనుల పురోగతిలో ఏడడు గులు ముందుకు పడలేదు.

ఆంద్రప్రదేశ్‌ ప్రజలకు ఉపయోగంలోకి రాలేదు. ప్రజలకు ఉపయోగంలోకి రాకున్నా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి రావడానికి రాజకీయ పక్షాలకు మాత్రం చక్కటి ప్రచారాస్థ్రంగా మారి వారికి మాత్రం వరంలా మారిందీ.. పోలవరం. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పనుల్లో వైఎస్‌ రాజశేశర్‌ రెడ్డి కదలిక తీసుకురాగా ప్రస్తుతం జాతీయ హోదా సాధించి ఈ పనుల్లో వేగం పెంచారు చంద్రబాబు. అయినా సరే ఇది ఇంకా బాలారి ష్టాలను ఎదుర్కుంటూనే ఉంది. ఏడు దశాబ్దాలుగా ముందుకు సాగని ఈ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేసి తీరుతామని ఇప్పటి సిఎం చంద్రబాబుచెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రల మద్య ఇదో ప్రధానాంశంగా మారింది. అటు తెలంగాణ ఇస్తే ఇటు పోలవరానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని సీమాంధ్ర నేతలు పట్టుపట్టారు. అన్నట్లుగానే అటు తెలంగాణ ఇచ్చేసి ఇటు పోలవరానికి జాతీయహోదా కల్పించారు. అంతే కాదు విడిపోయాక ఏపికి జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపితో పొత్తుపెట్టుకుని తెలుగుదేశం తన ప్రచా రంలో దీనిని 2018నాటికల్లా పూర్తి చేస్తానని వాగ్దానం చేసింది. టీడిపి హామీ మా హామీనేనని దీనికి పూర్తిస్థాయి నిధులు కేటాయించి నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని బీజేపి స్పష్టం చేసింది.

అనుకున్నట్లుగానే రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చాయి. ఇంకేముందు అదికోట్లు ఆంధ్రుల కల పోలవరం ఇక సాకారం అవుతుందన్న ఆశలో అందరిలోనూ కలిగింది. అన్నట్లుగానే జాతీయ హోదా కల్పించిన కేంద్రంలోని బీజేపి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకు రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ రెండున్నరేళ్ల కాలంలోనూ పోలవరం పనుల విషయంలో మిత్రులే అయినా టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. పనులు, డిజైన్ల విషయంలో వివాదాలు తలెత్తాయి. అనుమతుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఎట్టకేలకు రాష్ట్ర, కేంద్రాల మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో రాజీ కుదిరింది. మొత్తం నిధులు తామే ఇస్తామంటూ కేంద్రం నిధులు విడుదల చేయడంతో ఈ ప్రాజెక్టు పనులపై ఆశలు రేకెత్తాయి. స్పిల్‌వే పనులను ప్రారంభానికి నోచుకున్నాయి.ఇది పూర్తయితే లక్షలాధిమంది జీవితాల్లో వెలుగులు నింపే ఈ ప్రాజెక్టు పనుల తీరు, దానికి విడుదల అవుతున్న నిధుల తీరు చూస్తే మాత్రం పెదవి విరవక తప్పదు. కేంద్రం,రాష్ట్రం మధ్య విభేదాలు : పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న విభేదాలు కూడా ప్రాజెక్టు పనుల పురోగతికి అవరోధంగా మారాయి.

నిధుల విషయంలో మొదటి నుంచి విభేధాలు కొనసాగుతున్నాయి. జాతీయహోదా కల్పించినందును దీని పూర్తికయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం రాష్ట్ర విభజన నాటికి పోలవరం అంచనా వ్యయం ఎంతఉందో అంతే ఇస్తామని స్పష్టం చేసింది. అప్పటి అంచనాలు దాదాపు రూ.45వేల కోట్లు అని చెబుతున్నా.. ఏపి ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు పోలవరం అంచనా వ్యయాన్ని ప్రకటించడం లేదు. కేంద్రం పోలవరంకు దాదాపు రూ.2500కోట్లు విడుదల చేసి ఊరుకుంది.

మిగతా నిధుల కోసం ఏపి సర్కార్‌ ఎంతమొరపెట్టుకుంటున్నా నయాపైసా ఇవ్వడం లేదు. నితిన్‌గడ్కరీ జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాక దీని పనులను పరిశీలించి వెల్లారు. ఈ సంధర్భంగా కూడా తాము ఇప్పటి వరకు ఇచ్చిన నిధులకు సంబందించి ఖర్చు వివరాలు(యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు) సమర్పిస్తేనే తదుపరినిధులు విడుదలచేస్తామన్నారు. ఖర్చు వివరాలు అందిన 48గంటల్లోనే నిధులిస్తామన్నారు. అయినా సరే రాష్ట్రం మాత్రం ఖర్చు వివరాలు కేంద్రానికి ఇవ్వడంలో తాత్సారం చేస్తోంది. ఈమధ్యే కేంద్రం దీని కాపర్‌డ్యాం పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.

అయితే తాజాగా వారం రోజుల్లో కాపర్‌డ్యాం పనులు మొదలుపెట్టాలని ఏపి సర్కార్‌ ఆదేశాలివ్వడం విశేషం. కాంట్రాక్టర్‌ విషయంలోనూ : పోలవరం పనులు చేపడుతున్న ప్రధాన కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ట్రాన్స్‌రా§్‌ు విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి.

ట్రాన్స్‌రా§్‌ు పనులను నెమ్మదిగా చేస్తోందని ఏపి సర్కార్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా కాంట్రాక్టర్‌ను మార్చాలని పట్టుపడుతోంది. అయితే ఇటీవలే కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయంలో కుండబద్దలుకొట్టారు. కాంట్రా క్టర్‌ను మార్చడం కుదరదన్నారు. మార్చితే అంచనాలు పెరుగుతాయని చెప్పారు.

పెరిగిన వ్యయాన్ని రాష్ట్రం భరిస్తే కాంట్రాక్టర్‌ను మార్చడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. దీంతో ఈ విషయంలో ఏపి సర్కారు వెనుకడుగు వేసింది. అయితే కొన్ని ప్రధాన పనులను సబ్‌కాట్రాక్టర్లకు నేరుగా ఇచ్చుకునేం దుకు కేంద్రం అనుమతించింది. వారికి సంబంధిత పనుల డబ్బులను నేరుగా చెల్లించే అవకాశాన్ని ఇచ్చింది.

దీంతో కొన్ని పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఏపి సర్కార్‌ ఇటీవలే టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభ్యంతరాలు తెలుపుతున్న పొరుగు రాష్ట్రాలు : ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌లు కూడా పోలవరం విషయంలో అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్‌ పోలవరం ప్రాజెక్టును బహిరంగం గానే విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం మీద 87లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని చెప్పారు. ఒడిషాలోనూ పర్యావరణం దెబ్బతింటోందని అభ్యంతరం చెప్పారు.

తెలంగాణ, చత్తీస్‌ ఘడ్‌లు కూడా ముంపుపై అభ్యంతరాలు తెలిపాయి. ఈ విషయంలో హరిత ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించాయి. పోలవరంతో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో గిరిజన ప్రాంతం మునిగిపోతుందని తెలంగాణ వాదులు, జేఏసి, టిఆర్‌ఎస్‌, ప్రజాసంఘాలు ఈ పనులను అడ్డుకున్నాయి. దీనికి ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ కూడా తోడవడంతో ప్రాజెక్టు పనులు మందగించాయి. ఈ అటవీ ప్రాంతంపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది గిరిజనులు ఆధారం కోల్పోతారని, గిరిజన సంస్కృతి దెబ్బతింటుందన్నారు. కొన్ని సంస్థలు, నిపుణులుకూడా అభ్యంతరాలుతెలిపాయి.

చక్కటి ప్రకృతిసౌందర్యం అంతరించిపోతుం దని ప్రకృతి ప్రేమికులు అడ్డు తగిలారు. ప్రధానంగా ముంపు తగ్గించాలని, తెలంగాణ ప్రాంతంలోని గిరిజన గ్రామాలు ముంపు బాగా తగ్గించాలని డిమాండ్లు పెరిగాయి. సొంత రాష్ట్రం ఏపిలోనూ విపక్షాలు పోలవరం పనుల తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూనే దాని నిర్మాణంలో అనేక అవకతవకలు జరగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇంతటి ఒడిదొడుకుల మధ్య సాగుతున్న పోలవరం పనుల తీరును ఓసారి పరిశీలిస్తే… ఇప్పటివరకు జరిగిన పనులు : స్పిల్‌వే ఎర్త్‌ వర్క్‌ 90161.50లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర జరగాలి. ఇప్పటి వరకు కేవలం 143.81లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్క్‌ పూర్తి చేశారు.

ఈ ఏడాది 17లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాలని నిర్ణయించి 2016డిసెంబరు 19 నుంచి కాంక్రీట్‌ పనులు మొదలుపెట్టారు. 22వేల మెట్రిక్‌ టన్నుల రేడియల్‌ గేట్లుఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్పిల్‌చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్‌కు సంబంధించి మట్టితవ్వకం పనులు దాదాపు 32.65 శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 776.13లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టితవ్వకం పనులు జరగాలి.

ఇప్పటి వరకు కేవలం 253.44లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టితవ్వకం పనులు మాత్రమే జరిగాయి. ఈ నెల నుంచి(2017జనవరి) నుంచి 1.20లక్షల క్యూబిక్‌ మీటర్ల డయాఫ్రం వాల్‌ నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. పవర్‌ హౌజ్‌కు సంబంధించి 118లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేయాలి. ఇప్పటి వరకు 80.30లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టితవ్వకం పనులు మాత్రమే జరిగాయి. కుడి కాలువ పనులు 80శాతం, ఎడమ కాలువ పనులు 61శాతం పూర్తయ్యాయి.

ఈ కాలువల పనులు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి రాగానే మొదలవడం, చంద్రబాబు రాకతో ఈ పనుల్లో మరింత వేగం పెరగడంతో కాలువల పనుల్లో పురోగతి ఆశించిన మేర కనిపిస్తోంది. ప్రధానపనులు : స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు 1128.4మీటర్ల మేర నిర్మించి రేడియల్‌ గేట్లు ఏర్పాటుచేయాలి. 15మీటర్ల వెడల్పు, 2454 అడుగుల ఎత్తు గల డయాఫ్రం గోడ నిర్మించడంతో పాటు డ్యాం ముందు భాగంలో 1.5మీటర్ల మందంతో 40నుంచి 100మీటర్ల రివర్‌బెడ్‌ నిర్మించాలి.

12కెప్లానర్‌ టర్బైన్‌తో 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌హౌజ్‌( విద్యుత్‌ కేంద్రం) నిర్మించాలి. కుడి,ఎడమకాలువలకు నీరు ప్రవహించేలా రిజర్వాయర్‌ నుంచి గట్ల నిర్మాణం చేయాలి. కుడికాలువను 174కిలోమీటర్ల పొడవు నిర్మించాలి. దీని ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 3.2లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు. ఇదే కాలువద్వారా గోదావరి నుంచి 80టిఎంసీల నీటిని కృష్ణాకు మళ్లి స్తారు. 181.5కిలోమీటర్ల పొడవు ఎడమకాలువ నిర్మించాలి.

దీని ద్వారా తూర్పుగోదావరి, విశాఖ పట్టణ జిల్లాల్లోని నాలుగులక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72మీటర్లు( 150అడుగులు), కనీస నీటి మట్టం 41.15మీటర్లు( 135అడుగులు), క్రెస్ట్‌లెవల్‌ ఆఫ్‌ స్పిల్‌వే 25.72మీటర్లు( 84.39అడుగులు), ఈసిఆర్‌ఎఫ్‌ డ్యాం టాప్‌ బండ్‌ లెవల్‌ 54మీటర్లు( 177.16అడుగులు). రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 191.60టిఎంసీలు, లైవ్‌ స్టోరేజీ 75.20టిఎంసీలు, గరిష్ట ఫ్లడ్‌ నీటి విడుదల 50లక్షల క్యూసెక్కులు, క్యాచ్‌మెంట్‌ ఏరియా 3,06,643చదరపు కిలోమీటర్లు, ఆర్‌అండ్‌ ఆర్‌ రిహాబిలిటేషన్స్‌ 371. పోలవరం ప్రస్థానమిదీ..

: పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లో వచ్చింది.
1942-44 సంవత్సరాల మధ్య ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. 208 అడుగుల గరిష్ట నీటిమట్టంతో పాటు 836.35 టిఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని అప్పట్లో నిర్ణయించారు. పోలవరం నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్‌ చీఫ్‌ డిజైన్స్‌ ఇంజనీర్‌ ఆఫ్‌ యూఎస్‌ బిఆర్‌, డాక్టర్‌ జె.ఎల్‌.సాల్వేజ్‌, డెన్వర్‌ నేతృత్వంలో కొంత మంది ఇంజీనీరింగ్‌ నిపుణులతో ఓ బోర్డును ఏర్పాటుచేశారు.పోలవరం ప్రాజెక్టుకు మొదట రామపాద సాగర్‌ ప్రాజెక్టుగా పేరు పెట్టారు.

పోలవరం ప్రాజెక్టు గరిష్ట, కనిష్ట నీటి మట్టాలు 150 అడుగులు అంత కంటే కొంత ఎక్కువ ఉండవచ్చని గోదావరి జలవివాద ట్రిబ్యునల్‌ ఆదేశా లిచ్చింది. 2004-05లో పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన డ్యాంతో పాటు కాలువ పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు 2015 జనవరి 9న పోలవరం ప్రాజెక్టు అథారిటి ఏర్పాటుచేశారు.

2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం నాబార్డు నిధులతో కేంద్రమే భరిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలవరంతో లాభాలు : పోలవరం ప్రాజెక్టుతో కలిగే లాభాలను పరిశీలిస్తే.. దీని నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి అందుబాటు లోకి వస్తే 960మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. గోదావరి నుంచి కృష్ణా నదికి 80టిఎంసీల నీరుమళ్లింపు జరుగుతుంది. 7.2లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుంది.

విశాఖపట్టణం నగరవాసుల తాగునీటి అవసరాల కోసం 23.44టింఎంసీల నీటిని కేటాయిస్తారు. విశాఖతో పాటు 540గ్రామాలకు అంటే 28.5లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కలుగుతుంది. పడవలతో రవాణా పెరుగుతుంది. ఒడీషాకు 5టిఎంసీలు, చత్తీస్‌ఘడ్‌కు 1.5టింసీలు నీటిని సరఫరా చేస్తారు. అనుమతులు : ఈ ప్రాజెక్టుకు 2005 అక్టోబర్‌లో పర్యావరణ అనుమతి లభించింది.

2007 ఏప్రిల్‌లో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నుంచి ఆర్‌ అండ్‌ ఆర్‌ అనుమతులు లభించాయి. స్టేజ్‌-1 పనులకు 2008డిసెంబర్‌లో, స్టేజ్‌-2పనులకు 2010జూలైలో అటవీశాఖ అనుమతులు వచ్చాయి. 2010-11 సంవత్సరపు అంచనాల మేరకు ఈ ప్రాజెక్టు పూర్తి అంచనావ్యయం రూ.16,010.45 కోట్లు. ఇప్పుడు ఈ అంచనాలు చాలామేరకు పెరిగాయి. అయితే పెరిగిన అంచనాలను అధికారికంగా ప్రకటించలేదు.