పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం నాపూర్వ జన్మసుకృతం

Chandrababu
Chandrababu

పోలవరం: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా మాటాడుతు జీవితంలో ఎప్పుడు లేనత సంతోషంగా ఇప్పుడు ఉన్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఈరోజు ఏపి చరిత్రలో సుదినమని, తాను సిఎం అయ్యాక వేగంగా పనులు చేపట్టి సిఎంగా ఉన్న సమయంలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తుండటం తన పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. దేశంలో ఇంత వేగంగా నిర్మాణం జరిగిన ప్రాజెక్ట్ ఎక్కడా లేదన్నారు. ప్రపంచంలో ఉత్తమమైన ఏజెన్సీలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నామని… మే 2019లోపు అన్నీ గేట్లను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు 63 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2019లోపు ప్రాజెక్టును జాతికి అంకితం చేసే బాధ్యత తనదేని చంద్రబాబు తెలిపారు.