పోలవరం ప్రాజెక్టుకు నూటికి నూరు శాతం నిధులు: కన్నా

KANNA
KANNA

Guntur: పోలవరం ప్రాజెక్టుకు నూటికి నూరు శాతం నిధులు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య సభలో ఆయన మాట్లాడారు. చట్టంలో లేని 28 కేంద్ర సంస్థలకు కూడా రాష్ట్రానికి ఇచ్చారన్నారు. మొత్తం 39 కేంద్ర సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌ పేరుతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారన్నారు. మోడీ, అమిత్‌షా నాయకత్వంలో 2019 ఎన్నికలకు ముందుకెళ్దామన్నారు.