పోలవరం పూర్తి చేయడమే నా జీవితాశయం

AP CM BABU
AP CM BABU

51 శాతం పోలవరం పూర్తిఇప్పటికి రూ.12,500కోట్లు ఖర్చు పెట్టాం
కేంద్రం ఇచ్చింది కేవలం రూ.4,329 కోట్లు
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబడతాం
60సి కింద కొన్ని పనులు మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తాం
ప్రపంచస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం

– సిఎం చంద్రబాబు

వెలగపూడి సచివాలయం :  పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అని, దాన్ని పూర్తి చేయడమే తన జీవితాశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోని రాగానే 7ముంపు మండలాలను ఏపీలో కలపాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేశారని, అయినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే సోమవారాన్ని పోలవారంగా మార్చి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు చెప్పారు. తాను ఇప్పటివరకు 20సార్లు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌, స్పిల్‌వే పనులు 75శాతం, డయాఫ్రం వాల్‌ పనులు 47.99 శాతం, మట్టి పనులు 72శాతం పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్లు వంద శాతం పూర్తయ్యాయియని, ఇప్పటివరకు రూ.12,567.22కోట్లు పనులు పూర్తిచేస్తే కేంద్రం నుంచి రూ.4,329కోట్లు నిధులు వచ్చాయని తెలిపారు. నిధుల కొరతతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని, కేంద్రంనుంచి రావాల్సిననిధులను రాబతామని అన్నారు.

రూ.58, 391.06 కోట్లకు సవరించిన అంచనాలు కేంద్రానికి పంపించామని చంద్రబాబు ప్రకటించారు. కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 60,258ఎకరాలు సేకరించాలని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన 16జాతీయ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు, మరికొన్ని ప్రాజెక్టులు పనులు ప్రారంభంకాలేదని తెలిపారు. ప్రభుత్వం చొరవతో పోలవరం పనులు వేగంవతంగా సాగుతున్నాయని, కేంద్రం మరింత సహకరిం చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశాస్తామని తెలిపారు.60సీ కింద కొన్ని పనులు మరో కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామని తెలిపారు.

ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లాభాలు ఆశించకుండా నిర్మాణ సంస్ధలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగకరమైన మహా యజ్ఞంగా చేపడుతున్నామని తెలిపారు.

నాణ్యత సరిగలేదని కేంద్రం పట్టించుకోవడంలేదని కొంతమంది కావాలని తప్పుడు ప్రచారంచేస్తున్నా రని మండిపడ్డారు. ఎక్కడా రాజీలేకుండా అన్ని విభాగాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. ఎంతడబ్బు ఖర్చయినా పోలవరంపై హైకోర్టులో పిటిషన్‌వేశారని, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిం చవకపోయిన ఫర్వాలేదు కానీ, అడ్డుకోవద్దని అన్నారు. దేశంలోనే నిపుణులైన ఇంజనీర్ల సహకారంతో నిర్మాణం చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు పనులు నాణ్యతపై దుష్ప్రచారం సరికా దన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పోలవరం తెలుగు ప్రజలకు వరం:
మంత్రి దేవినేని పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజలకు వరమని జలవనరులశాఖ మంత్రి దేవినేని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనుకున్న సమ యానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సిఎం చంద్రబాబు సోమవారంను పోలవారంగా మార్చి పనులు వేగవంతం చేస్తు న్నారని తెలిపారు. ఇప్పటికీ సిఎం 20సార్లు పోలవరం సందర్శన, 46సార్లు వర్సువల్‌ సమీ క్షలు చేస్తూ ఎప్పటికికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.డిసెంబర్‌ రెండోవారంనాటికి ప్రస్తుతం ఉన్న నిర్మాణ సంస్ధకు కొత్త నిర్మాణ సంస్ధలను జత చేసి 2018లో గ్రావిటీ ద్వారా నీరందించా లని లక్ష్యంగాపెట్టుకున్నామని తెలిపారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గత వారంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ఎమ్మేల్యేలు సందర్శించడం జరిగిందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం అవసరం ఉంటుందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని ఆయన కోరారు. పోల వరం ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలు సరికాదని ఆయన తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైఎస్సార్సీ పనిగా పట్టుకుందని ఆయన విమ ర్శించారు.

పోలవరం నిర్మాణంతో రైతుల్లో ఆనందం: ఎమ్మెల్యే ఆంజనేయులు

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో తమ జీవితం ధన్యమైందని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఎమ్మేల్యే ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పోలవరం పనులు రాకెట్‌వేగంతో సాగుతున్నాయని తెలి పారు. 90శాతం మట్టిపనులు, 60శాతం ప్రాజెక్టు పనులు పూర్తియ్యాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో మిగులు జలాలు అవసరంలేదని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్రృష్ట ట్రిబ్యునల్‌కు లేఖవ్రాశారని, ఏ ముఖ్య మంత్రి అయినా మిగులు జలాలు వద్దంటారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం అడుగడునా అడ్డుపడుతూ కోర్టుల్లో కేసులు వేస్తుందనిఅన్నారు.

పోలవరాన్నిసకాలంలో పూర్తి చేసి ప్రజల అభినందనలు అందుకుంటామని తెలిపారు. సోమవారాన్ని అందరు పోలవారం అంటున్నారు: ఎమ్మేల్యే వర్మ దేశ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్టు అయిన పోల వరాన్ని పూర్తిచేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనభూజాలపై వేసుకున్నా రని ఎమ్మేల్యే వర్మఅన్నారు. అందరు సోమ వారాన్ని పోలవరం అంటున్నారని, ఆదిశగా పోలవరం నిర్మాణపనులు వేగవంతంగా సాగు తున్నాయన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వాల హాయంలో పోలవరం పనులు తాబేలునడకగా ఉండేవన్నారు.