పోతిరెడ్డిపాడు నీటి విడుదలకు ఆదేశాలు

AP CM BABU
AP CM BABU

నేడు పోతిరెడ్డిపాడు నీటి విడుదలకు సిఎం ఆదేశాలు
ఇక సీమ జిల్లాల్లో జలకళ
శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు

అమరావతి,µ: ఇటీవల వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సంబంధిత ఎత్తు ప్రాంతాలనుంచి కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి వరదనీటితో సీమ జిల్లాల్లో పలు ప్రాజక్టులకు నీరు చేరడంతో మంగళవారం నీరు విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి సీమజిల్లాలకు నీటిని వదలాలని ఆదేశించారు.

అలాగే కృష్ణాజిల్లాలు ఇప్పుడిప్పుడే రాయలసీమ జిల్లాలకు చేరుతున్నాయి. మరో వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో చేరనున్నది. శ్రీశైలం, సుంకేసుల, అవుకు రిజర్వాయర్‌ ద్వారా మైలవరం, గండికోట, హంద్రీ-నీవాలకు నీరు వదిలి తద్వారా పంటకుంటలు, చెక్‌ డ్యాంలు, చెరువులు, కుంటలను నీటితో నింపాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు సిఎం బాబు ఆదేశించారు. సోమవారం సిఎం నీరు, ప్రగతి వ్యవసాయంపై బాబు ఉండవల్లి నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి వరదలు, అంటువ్యాధులు, వ్యవసాయంపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీచేశారు.