పోటీపై త్వరలో నిర్ణయం

Pawan
Pawan

అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంపై నేతలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని..23 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావించామని అన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో ప్రణాళిక వేసే సమయంలేక పార్టీలో సందిగ్ధత నెలకొందని అన్నారు. ఐతే కొంతమందిని స్వతంత్రంగా నిలబెడతామని తమకు మద్దతు తెలపాలని కోరుతున్నామని పవన్‌ చెప్పారు. పవన్‌ సమక్షంలో కాంగ్రెస్‌ నేత పసుపులేటి బాలరాజు జనసేనలో చేరారు. ఆ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపికి మద్దతు తెలిపినట్లు గుర్తు చేశారు. నేడు టిడిపికి స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని విమర్శించారు.