పోక్సోచట్ట సవరణకు రాష్ట్రపతి ఆమోదముద్ర

President Ramnath Kovind
Ramnath kovind

న్యూఢిలీ: పోక్సోచట్ట సవరణ ఆర్డినెన్స్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. 12ఏళ్ల మైనర్లపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన విధించేలా పోక్సోచట్ట సవరణలు చేశారు. కథువా అత్యాచార ఘటనతో పోక్సో చట్టానికి సవరణ చేశారు. శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చిన్నారులపై అత్యాచారం చేస్తే ఉరి శిక్ష విధించాలనే ఆర్డినెన్స్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మైనర్లపై అత్యాచార కేసులను సత్వర న్యాయకోర్టుల్లో విచారణ చేయనున్నారు.