పొరపాటున బిజెపికి ఓటువేసి వేలు నరుక్కున్న యువకుడు

న్యూఢిల్లీ: దేశంలో రెండోదశ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ సమయంలో ఆసక్తికర ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.90 ఏళ్లు నిండిన వృదుధలు సైతం ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా, కొన్ని ప్రాంతాల్లో పాతికేళ్ల యువకులు సైతం బద్ధకంతో ఓటువేయలేదు, ఐతే వీటన్నింటినీ మించి ఉత్తరప్రదేశ్‌లో ఓ ఓటర్ చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాను వేయదలుచుకున్న పార్టీకీ కాకుండా పొరపాటున వేరొక అభ్యర్ధికి ఓటువేయడంతో, అతడు జీర్ణించుకోలేకపోయాడు, చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన వేలుని తానే నరుక్కున్నాడు.
25 ఏల్ల పవన్ కుమార్ బులంద్‌షహర్ లోక్‌సభ పరిధిలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడ బిఎస్పీ వీరాభిమాని. గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో బి ఎస్పీ-ఎస్పీ- ఆర్ ఎల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటువేశాడు. ఇవిఎంలో ఏనుగు గుర్తు మీద కాకుండా, కమలం గుర్తు మీటనొక్కాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్, పశ్చతాపం కోసం తన వేలును తానే నరుక్కున్నాడు. ఓటు వేసిన చూపుడు వేలుని కత్తితో నరికేశాడు. ఆ విడియో ఇప్పుడు సోషల్ మిడియాలో వైరల్‌గా మారింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/