పొన్నాల‌కు డిగ్నిట‌రీ మ్యాన్ ఆఫ్ ఆసియా అవార్డు

ponnala .Lakshmaiah
ponnala .Lakshmaiah

న్యూయార్క్ః తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యకు అమెరికా సంస్థ డిగ్నిటరీ మ్యాన్‌ ఆఫ్‌ ఆసియా అవార్డు ప్రకటించింది. న్యూయార్క్‌లో డబ్ల్యూసిహెచ్ హ్యుమానిటేరియన్‌ 4వ వార్షిక సమ్మిట్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు డిగ్నిటరీ మ్యాన్‌ ఆఫ్‌ ఆసియా అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ ఇన్నేళ్ల ప్రజాజీవితంలో చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వెలిబుచ్చారు.