పొత్తుల నిర్ణయం రాహుల్‌దే

RAGHU VEERA REDDY
RAGHU VEERA REDDY

పొత్తుల నిర్ణయం రాహుల్‌దే 

– కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌ అధికారంలోకి రావడం కల్ల
– నరేంద్ర మోడీ ఓ హిట్లర్‌: పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి

అనంతపురం టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల నిర్ణ యం అనేది ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేతిలో ఉందని ఎపిసిసి అధ్యక్షు డు, మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ హయాంలో శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజ ర్వాయర్‌కు హంద్రీనీవా కాలువద్వారా భగీరథ పాదయాత్ర పూర్తయి ఆరు సం వత్సరాలైన సందర్భంగా రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ టవర్‌క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌, తెలుగుతల్లి విగ్రహం వరకు నిర్వహించారు. కృష్ణ జలాలతో తెలుగుతల్లి విగ్రహానికి కాంగ్రెస్‌ నేతలు అభిషేకం చే శారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. హంద్రీ నీవా జలాలు అనంతకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేన న్నారు. హంద్రీనీవా మొదటి దశ, రెండవ దశ కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే పూర్తయ్యిందన్నారు.కాంగ్రెస్‌ హయాంలో అనం తకు హంద్రీనీవా జలాలు తీసుకురావడానికి నేతలు అడ్డుకున్నా రన్నారు. రాహుల్‌ గాంధీ 2019లో ప్రధాని అయితే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని, విభజనచట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. రాష్ట్ర విభజనకు అన్నిపార్టీలు మద్దతిచ్చాయని, కేవలం కాంగ్రెస్‌పార్టీపైనే ఇతరపార్టీలు బుదర జల్లారన్నారు. రాహుల్‌ ప్రధాని అయితే రాష్ట్రానికి రావాల్సిన 24,350 కోట్ల నిధులను తీసుకొస్తామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రస్తుతం నిర్వీర్యమైందని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్ని మెరుగుపరిచి కూలీ లకు ఉపాధి కల్పించి, న్యాయం చేస్తామన్నారు. రాయదుర్గంకు ఉక్కు కర్మాగారాన్ని తీసుకొస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చి వుంటే ఆంధ్రప్రదేశ్‌కు విరివిగా పరిశ్రమలు వచ్చే వని తద్వారా నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు.